తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత్​-ఆసియాన్​ దేశాల పరస్పర సహకారంతోనే ఆర్థికాభివృద్ధి'

భారత్​-ఆసియాన్​ దేశాల మధ్య సంబంధాల విస్తరణకు భారత్​ కట్టుబడి ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 16వ ఆసియాన్​-భారత్​ సదస్సులో భాగంగా.. తీరప్రాంత రక్షణ సహా పలు అంశాల్లో కూటమి సభ్యదేశాలతో కలిసి పనిచేస్తామని మోదీ స్పష్టం చేశారు. భారత్​-ఆసియాన్​ దేశాల మధ్య పరస్పర సహకారంతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

పరస్పర సహకారంతోనే ఆర్థికాభివృద్ధి

By

Published : Nov 3, 2019, 12:37 PM IST

Updated : Nov 3, 2019, 2:57 PM IST

భారత్​-ఆసియాన్​ దేశాల పరస్పర సహకారంతోనే ఆర్థికాభివృద్ధి

ఆసియాన్​ దేశాలతో బహుళ విభాగాల్లో సంబంధాల విస్తరణకు భారత్​ కట్టుబడి ఉందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత ఉపరితలం, గగనతలం, తీరప్రాంతాల్లో 10 దేశాలతో భారత్​ అనుసంధానత ద్వారా కూటమిలోని సభ్యదేశాలు, భారత్​ మధ్య ప్రాంతీయ వాణిజ్యం, ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందన్నారు.

మూడు రోజుల పర్యటనలో భాగంగా థాయిలాండ్​లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్యాంకాక్​లో జరిగిన 16వ ఆసియాన్​-భారత్​ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ప్రసంగించారు.

తీరప్రాంత రక్షణ సహా వ్యవసాయం, ఇంజినీరింగ్​, డిజిటల్​ సాంకేతికత, పరిశోధన రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు మోదీ. పలు అంశాల్లో ఆసియాన్​ కూటమిలోని సభ్యదేశాలతో కలిసి సహకరించేందుకు భారత్​ సిద్ధంగా ఉందని తెలిపారు.

" సమకాలీన, సంఘటిత ఆర్థిక పురోగతి గల ఆసియాన్​కు సహకారం అందించేందుకు​ భారత్ ముందుంటుంది. మేము ఉపరితలం, తీరప్రాంతం, గగనతలంలో ఆసియాన్​ దేశాలతో అనుసంధానత బలోపేతానికి డిజిటల్​ విధానాన్ని అభివృద్ధి పరిచేందుకు కట్టుబడి ఉన్నాం. డిజిటల్​ అనుసంధానం కోసం ఒక బిలియన్​ డాలర్లను ఖర్చు చేశాం. పరిశోధన, అనుసంధానం, వాణిజ్య, పర్యటక రంగానికి చెందిన వారి చేత భారత్​లో పెట్టుబడులు పెట్టించేందుకు కృషి చేస్తున్నాం. ఈ లక్ష్యసాధనకు భారత్​-ఆసియాన్​తో సహా ఇతర దేశాలతో సంబంధాల బలోపేతానికి సిద్ధంగా ఉన్నాం."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఇండో-ఫసిఫిక్​ ప్రాంతానికి సంబంధించి పరస్పర సహకారంపై కూటమి, భారత్​ దేశాలు ఏకాభిప్రాయంతో ఉండటాన్ని ప్రధాని స్వాగతించారు.

ఈ పర్యటనలో భాగంగా థాయ్​లాండ్​ ప్రధాని, జనరల్​ ప్రయూత్​ చాన్​ ఓ చాన్​తో మోదీ సమావేశం కానున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో.. మయన్మార్​ కౌన్సిలర్​ అంగ్​సాన్​ సూకీతో కూడా భేటీ అవుతారు. సాయంత్రం జరిగే విందులో పాల్గొంటారు.

ఇదీ చూడండి: '5 ట్రిలియన్​ డాలర్ల భారత్​ కల తొందరలోనే సాకారం'

Last Updated : Nov 3, 2019, 2:57 PM IST

ABOUT THE AUTHOR

...view details