అఫ్గానిస్థాన్, భారత్ మధ్య ఉన్న స్నేహబంధాన్ని ఏ శక్తీ విడదీయలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బయటి శక్తులు అఫ్గాన్ అభివృద్ధిని అడ్డుకోలేవని పేర్కొన్నారు. అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనితో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్నారు మోదీ. ఇటీవల అఫ్గాన్‌లో సాధారణ పౌరులు, జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడుల పట్ల విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాద నిర్మూలనలో అఫ్గాన్‌కు భారత్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
తాలిబన్ మద్ధతుదారులు, రాజకీయ పార్టీలు కలిసి ఉత్తమ పరిష్కారాన్ని కనుగొంటే అఫ్గాన్‌లో శాంతిపూర్వక వాతావరణం నెలకొంటుందని అష్రప్ ఘనీ అన్నారు.