రెండు రోజుల భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యాల్ వాంగ్‌చుక్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు ఆదర్శప్రాయమైన భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
ప్రధాని మోదీకి భూటాన్ రాజదంపతలు సంప్రదాయరీతిలో స్వాగతం పలికినట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ట్వీట్ చేశారు.
"ప్రధాని మోదీకి భూటాన్‌లో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్యనున్న భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా మోదీ, భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యాల్ వాంగ్చుక్లు చర్చలు జరిపారు."
-రవీశ్‌కుమార్, భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి
10 అవగాహన ఒప్పందాలు
భారత్-భూటాన్‌ల మధ్య విద్యుత్ కొనగోలు సహా 10 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇరుదేశాల ప్రధానులు మోదీ, లోటే షెరింగ్ ద్వైపాక్షిక చర్చలు జరిపిన తరువాత ఈ ఒప్పందాలపై రెండు దేశాల ప్రతినిధిలు సంతకాలు చేశారు.