తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఐరాస'లో కశ్మీరీల గళం వినిపిస్తా: పాక్ ప్రధాని

ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల్లో కశ్మీర్‌ వాసులను అసంతృప్తిపరచనని చెప్పారు పాక్ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​. భారత ప్రభుత్వ చర్యల కారణంగానే జమ్ముకశ్మీర్‌లో తీవ్రవాదం పెరిగిపోతోందన్నారు ఇమ్రాన్​.

'ఐరాస'లో కశ్మీరీలను అసంతృప్తి పరచను : ఇమ్రాన్​

By

Published : Sep 13, 2019, 7:39 PM IST

Updated : Sep 30, 2019, 12:05 PM IST

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌370 రద్దుపై అంతర్జాతీయ సమాజం మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్న పాకిస్థాన్‌ తరచూ ఎదురుదెబ్బలు తింటూనే ఉంది. అయినప్పటికీ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మరోసారి బీరాలు పలికారు. త్వరలో జరగనున్న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల్లో కశ్మీర్‌ వాసులను అసంతృప్తిపరచనని తెలిపారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ రాజధాని ముజఫరాబాద్‌లో కశ్మీరీలకు సంఘీభావంగా జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

కశ్మీర్‌ వాసుల పరిస్థితిని ప్రతి అంతర్జాతీయ వేదిక మీద లేవనెత్తుతామన్న ఇమ్రాన్​.. గతంలో ఎవరూ కృషి చేయనంతగా కశ్మీరీల హక్కుల కోసం నిలబడతానని హామీ ఇచ్చారు. భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కారు. భారత ప్రభుత్వ చర్యలతోనే జమ్ముకశ్మీర్‌లో తీవ్రవాదం పెరిగిపోతోందన్నారు. అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేస్తే ఉగ్రవాదం పుట్టుకొస్తుందని ఇమ్రాన్​ వ్యాఖ్యానించారు.

" ప్రజలు విసిగిపోతే అవమానాలకు గురి కావడం కన్నా చనిపోవాలనే నిర్ణయించుకుంటారు. ఆ పరిస్ధితుల్లో నేను ఉన్నా అదే పని చేస్తాను. జమ్ముకశ్మీర్‌ ప్రజల పట్ల భారత్‌ వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగానే అక్కడి యువకుడు పుల్వామా ఉగ్రదాడి జరిపాడు. భారత్‌ ఎలాంటి దాడి చేసినా దీటుగా ఎదుర్కొంటాం."
- ఇమ్రాన్‌ ఖాన్, పాక్ ప్రధాని

Last Updated : Sep 30, 2019, 12:05 PM IST

ABOUT THE AUTHOR

...view details