దాయాది పాక్‌పై అంతర్జాతీయ ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ (ఎఫ్ఏటీఎఫ్)కత్తి వేలాడుతోంది. ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు సమకూర్చడాన్ని అరికట్టడంలో విఫలమైనందుకు పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లోనే కొనసాగించాలని పారిస్ వేదికగా జరుగుతున్న సమావేశాల్లో ఎఫ్ఏటీఎఫ్కు చెందిన అంతర్జాతీయ సహకార సమీక్ష విభాగం (ఐసీఆర్జీ)ప్రతిపాదించింది. ఈ అంశమై ఫిబ్రవరి 21న తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
"పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లోనే ఉంచాలని ఐసీఆర్జీ సమావేశంలో తీర్మానించారు. పాక్ వ్యవహారాలపై చర్చించి ఎఫ్ఏటీఎఫ్ దీనిపై శుక్రవారం తుదినిర్ణయం తీసుకుంటుంది."
-అధికార వర్గాలు
పారిస్‌లో ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో భాగంగా పాక్ ప్రదర్శనను అంచనా వేసింది ఐసీఆర్జీ. ఉగ్రవాదులకు నిధులు అందజేసే విషయంలో చట్టాలను మరింత కట్టుదిట్టం చేయాలని ఆ దేశానికి హితవు పలికింది.
పాక్‌ను గ్రే లిస్ట్‌లోనే ఉంచాలా లేదా అన్న విషయంపై నిర్ణయం తీసుకునే ప్లీనరీ సమావేశాలు బుధవారం(ఫిబ్రవరి 19) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రే లిస్ట్‌లో ఉన్న పాకిస్థాన్ బ్లాక్ లిస్ట్‌లో పడకుండా జాగ్రత్త పడుతోంది.