తెలంగాణ

telangana

ETV Bharat / international

అంతర్జాతీయ సమాజమా.. భారత్​ను అడ్డుకో: పాక్​ - ఆర్టికల్ 370 రద్దు

పీవోకే భారత అంతర్భాగమేనన్న విదేశాంగమంత్రి జైశంకర్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ సమాజం ఈ విషయంపై స్పందించాలని కోరింది. తాము శాంతినే కోరుకుంటామని, అవసరమైతే యుద్ధానికీ సిద్ధమేనని పేర్కొంది.

అంతర్జాతీయ సమాజమా.. భారత్​ను అడ్డుకో: పాక్​

By

Published : Sep 18, 2019, 5:39 AM IST

Updated : Oct 1, 2019, 12:40 AM IST

అంతర్జాతీయ సమాజమా.. భారత్​ను అడ్డుకో: పాక్​

పాక్ ఆక్రమిత కశ్మీరే తమ తదుపరి లక్ష్యమని భారత్​ ప్రకటించిన నేపథ్యంలో పాక్ కంగారుతో మల్లగుల్లాలు పడుతోంది. భారత్​ దూకుడు తట్టుకోలేక... తమను ఆదుకోవాలంటూ అంతర్జాతీయ సమాజాన్ని వేడుకుంటోంది. 'భారత్​ చేసిన బాధ్యతారహితమైన ప్రకటనలు ఉపఖండంలో ఉద్రిక్తతలను పెంచుతాయి. ఇది శాంతి భద్రతలకు విఘాతమని' పాక్​ మొసలి కన్నీరు కారుస్తోంది.

పీవోకే... భారత్​లో అంతర్భాగమే

పాక్​ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్​లో అంతర్భాగమేనని విదేశీ వ్యవహారాల మంత్రి యస్​ జైశంకర్​ స్పష్టం చేశారు. శాంతి చర్చలు కశ్మీర్​పై కాకుండా పీవోకేపైనే ఉంటాయని, ఇదే భారత్​ వైఖరి అని తేల్చిచెప్పారు.

పాక్​ గావుకేకలు

జైశంకర్​ వ్యాఖ్యలతో పాక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారత్​ దుందుడుకు చర్యలపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని గావుకేకలు పెడుతోంది.

" పీవోకేపై బాధ్యతారహితంగా, ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టేలా భారత విదేశాంగమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కశ్మీర్​లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న విమర్శలతో భారత్ పూర్తిగా నిరాశకు గురైందనటానికి ఇది నిదర్శనం. పాక్​ శాంతిని కోరుకుంటుంది. కానీ భారత్​ దురాక్రమణకు ప్రయత్నిస్తే... సరైన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం."
- పాకిస్థాన్​

ఆర్టికల్ 370 రద్దుతో

కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని పాక్ వ్యతిరేకిస్తూ.. అంతర్జాతీయ సంస్థలను ఆశ్రయించింది. అయితే కశ్మీర్​ భారత అంతర్గత విషయమని అంతర్జాతీయ సమాజానికి భారత్ తేల్చిచెప్పింది. అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి:మోదీతో సమావేశంలో బంగాల్ అంశాలే: దీదీ

ఇదీ చూడండి:'కశ్మీర్​పై ఆరోపణలను లెక్కచేయాల్సిన అవసరం లేదు'

Last Updated : Oct 1, 2019, 12:40 AM IST

ABOUT THE AUTHOR

...view details