అఫ్గానిస్థాన్‌కు సహాయంగా భారత్ ప్రకటించిన 50వేల మెట్రిక్ టన్నుల (India Afghanistan News) గోధుములను పాకిస్థాన్ మీదుగా తరలించేందుకు పాక్ ప్రభుత్వం అంగీకరించింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో ఇస్లామాబాద్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రవాణా విధివిధానాలను ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న అఫ్గానిస్థాన్‌ను (India Afghanistan News) ఆదుకోవడం అందరి బాధ్యత అని వ్యాఖ్యానించారు.
గతనెల భారత్.. అఫ్గానిస్థాన్‌కు 50వేల మెట్రిక్ టన్నుల గోధుమలను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వీటిని వాఘ (India Afghanistan News) సరిహద్దు మీదుగా తరలించేందుకు అనుమతించాలని పాక్ ప్రభుత్వాన్ని కోరింది.