ఉగ్రవాద సంస్థ 'జైషే మహమ్మద్' స్థాపకుడు మసూద్ అజార్ తమ దేశంలోనే ఉన్నాడని పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మూద్ ఖురేషి మరోసారి స్పష్టం చేశారు. మసూద్ ప్రస్తుతం మూత్రపిండాల సమస్యతో బాధ పడుతున్నాడని, పాకిస్థాన్‌లోని రావల్పిండి సైనిక ఆస్పత్రిలో తరచూ డయాలసిస్ చేయించుకుంటున్నాడని అధికారులు తెలిపారు.
"పాక్‌లోనే మసూద్" - జేఈఎమ్
పుల్వామా ఉగ్రదాడి కీలక సూత్రధారి మసూద్ అజార్ పాక్‌లోనే ఉన్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మహమ్మూద్ ఖురేషీ పునరుద్ఘాటించారు.
పాక్‌లోనే మసూద్
"మసూద్ అజార్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడు. ఇప్పటి వరకు నాకున్న సమాచారం మేరకు అతడు ఇంట్లో నుంచి బయటకు రాలేనంత తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నాడు "
- షా మహమ్మూద్ ఖురేషీ, పాక్ విదేశాంగ మంత్రి