ఫిబ్రవరిలో జరిగిన బాలాకోట్ వైమానిక దాడుల ఘటన అనంతరం భారత్‌పై విధించిన తాత్కాలిక వాయుమార్గ ఆంక్షలను ఎత్తివేస్తామని ప్రకటించింది పొరుగు దేశం పాకిస్థాన్.
బాలాకోట్ ఘటన అనంతరం భారత గగనతలంలో పాక్‌పై విధించిన ఆంక్షలను వాయుసేన ఎత్తివేసింది. భారత గగన తలంలోని అన్ని వాయు మార్గాలపై 2019 ఫిబ్రవరి 27న విధించిన తాత్కాలిక ఆంక్షలను తొలగించినట్లు అధికారిక ట్విటర్ ఖాతాలో శుక్రవారం వెల్లడించింది ఐఏఎఫ్.
భారత్ నిర్ణయానికి ప్రతిస్పందించింది పాక్. తమ గగనతలంలోకి భారత విమానాల ప్రవేశంపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తామని ప్రకటించింది. భారత వైమానిక దళం ట్విట్టర్ ద్వారా ప్రకటన విడుదల చేసిందని, తమకు అధికారిక సమాచారం అందలేదని పాకిస్థాన్ ప్రభుత్వ సీనియర్ అధికారి చెప్పారు. మీడియాలో మాత్రమే వార్తలు చూశామన్నారు. భారత్ వాయుమార్గం ఆంక్షలు ఎత్తివేస్తే పాక్ కూడా అందుకు సిద్ధమని స్పష్టం చేశారు.