తెలంగాణ

telangana

ETV Bharat / international

మసూద్​పై మారిన పాక్ - మసూద్

మసూద్ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ఐరాస ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వస్తున్న పాక్ ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు యోచిస్తోంది.

మసూద్​పై మారిన పాక్

By

Published : Mar 4, 2019, 12:05 AM IST


జైషే మహమ్మద్ అగ్రనేత మసూద్ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ఐరాస ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వస్తోంది పాక్. అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా వ్యతిరేకించే విషయంలో వెనక్కి తగ్గాలని యోచిస్తోంది దాయాది దేశం.

మసూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని అగ్రదేశాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్​ బుధవారం తాజా ప్రతిపాదన చేశాయి. అజర్​పై తీసుకునే చర్యలు స్పష్టంగా తెలియదని పాక్ భద్రతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

నాలుగోసారి

ఐరాస భద్రతామండలిలోని 15 సభ్యదేశాల్లో మూడు అంగీకరిస్తే 10 రోజుల్లో మసూద్​పై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. పదేళ్లలో మసూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదన రావడం ఇది నాలుగోసారి. మొదటగా 2009, 2016లో భారత్ ప్రతిపాదించగా 2017లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్​లతో కూడిన పీ-3 దేశాల కూటమి ప్రతిపాదించింది.

ABOUT THE AUTHOR

...view details