పాక్ మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించింది. 12 గంటల కాలంలో రెండు సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లో నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది.
"ఉదయం 7 గంటల 30 నిమిషాలకు... పాకిస్థాన్ సైన్యం ఆకస్మిక కాల్పులు జరిపింది. రాజౌరీ సుందర్‌బాని సెక్టార్లో దాడికి దిగింది. అందుకు భారత సైన్యం ధీటుగా సమాధానమిచ్చింది."