తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​ సైన్యాధ్యక్షుడి పదవీ కాలం పొడగింపు - ఇమ్రాన్​ ఖాన్

370 రద్దుతో భారత్​తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సైన్యాధ్యక్షుడి పదవీకాలాన్ని పొడగిస్తూ పాకిస్థాన్​ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పాక్​ ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

పాక్​ సైన్యాధ్యక్షుడి పదవీ కాలం పొడగింపు

By

Published : Aug 19, 2019, 9:06 PM IST

Updated : Sep 27, 2019, 2:00 PM IST

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మేజర్ ఖమర్​ జావెద్ భజ్వా పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాక్ ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

"జనరల్​ భజ్వా సైన్యాధ్యక్షడి పదవీ కాలాన్ని మరో 3 ఏళ్లు పెంచుతున్నాం. ప్రస్తుత పదవీ కాలం పూర్తయిన తేదీ నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. ప్రాంతీయ భద్రతా పరిస్థితుల దృష్ట్యా ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు."

- పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం

త్వరలోనే ముగియనున్న జావెద్ భజ్వా పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగించాలని తొలుత భావించారు ఇమ్రాన్. అయితే మూడేళ్ల పాటు పెంచాలన్న భజ్వా ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని మేజర్ జావెద్ భజ్వా తీవ్రంగా తప్పుబట్టారు. కశ్మీరీలకు పాకిస్థాన్​ అండంగా ఉంటుందని గతంలో చెప్పారు. వారి స్వాతంత్ర్య పోరాటానికి పాకిస్థాన్ సైన్యం మద్దతునిస్తుందని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: రాజ్యసభకు మన్మోహన్​ సింగ్​ ఎన్నిక ఏకగ్రీవం

Last Updated : Sep 27, 2019, 2:00 PM IST

ABOUT THE AUTHOR

...view details