కరోనా వ్యాప్తిని నివారించేందుకు చైనా అధికారులు వినూత్న మార్గాన్ని అనుసరిస్తున్నారు. ప్రభుత్వ బస్సులు, లిఫ్టుల్లో కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు అతినీలలోహిత కాంతిని ప్రసారం చేస్తున్నారు.
చైనాలో కరోనా మహమ్మారి బారిన పడి 3,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ విలయతాండవానికి కారణమైన కరోనాను రూపుమాపడానికి కఠినమైన నివారణ చర్యలు చేపట్టాలని కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయి. దీనితో అప్రమత్తమైన అధికారులు ప్రతిదీ శుభ్రంగా ఉంచడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానం వైపు మొగ్గు చూపుతున్నారు.
యూవీ లైట్‌తో
షాంఘై ప్రజా రవాణా సంస్థ యాంగ్గావ్... బస్సులను శుభ్రపరిచేందుకు రెండు సాధారణ గదులను క్రిమిసంహారక గదులుగా మార్చింది. ఇవి ఒక్కొక్కటి రోజుకు 250 బస్సులను యూవీ కిరణాలు ప్రసరింపజేసి శుభ్రపరుస్తాయి. ఫలితంగా మానవ వనరుల వినియోగం బాగా తగ్గింది. ఫలితంగా 40 నిమిషాలు పట్టే ప్రక్రియ 5 నిమిషాలకు తగ్గింది.