తెలంగాణ

telangana

ETV Bharat / international

అత్యంత వృద్ధ మహిళగా రికార్డ్​ - kane tanaka

జపాన్​లోని 116 ఏళ్ల మహిళ... ప్రపంచంలోనే అతి వృద్ధ మహిళగా గిన్నిస్​ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది.

కేన్​ తానకా

By

Published : Mar 9, 2019, 2:51 PM IST

116 ఏళ్లు నిండిన కేన్​ తానకాకు గిన్నిస్​ వరల్డ్​ రికార్డులో చోటు లభించింది. జపాన్​లోని ఫుక్వోకాలో నివసిస్తున్న కేన్​ తాజాగా 116వ జన్మదినాన్ని జరుపుకున్నారు. అధికారికంగా ధ్రువీకరించిన గిన్నిస్​ ప్రతినిధులు.. జీవించి ఉన్న అత్యంత వృద్ధ మహిళగా తానకాను గుర్తించారు.

1903 జవవరి 2న తానకా జన్మించారు. ఆమెకు గణితంతో పాటు 'ఓతెల్లో' ఆట అంటే ఇష్టం.

జపాన్​కు చెందిన మహిళ చియో మియాకో పేరిట ఈ రికార్డు ఉండేది. 117 ఏళ్ల వయసులో గతేడాది జులైలో ఆమె మరణించారు.

ఇదీ చూడండి:60ఏళ్లయినా తగ్గని క్రేజ్​

ABOUT THE AUTHOR

...view details