తెలంగాణ

telangana

ETV Bharat / international

పుతిన్​తో తొలిసారి భేటీకి రష్యా చేరుకున్న కిమ్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​తో తొలిసారి సమావేశమయ్యేందుకు రష్యాకు​ చేరుకున్నారు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్​. అమెరికా అధ్యక్షుడు ట్రంప్​తో చర్చలు విఫలమైన తర్వాత వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

పుతిన్​తో తొలిసారి భేటీకి రష్యా చేరుకున్న కిమ్

By

Published : Apr 25, 2019, 7:02 AM IST

Updated : Apr 25, 2019, 7:21 AM IST

పుతిన్​తో తొలిసారి భేటీకి రష్యా చేరుకున్న కిమ్

ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​ రష్యాలోని వ్లాదివొస్తోక్​ పట్టణం చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​​తో నేడు మొదటిసారి సమావేశం కానున్నారు కిమ్​. పుతిన్​తో భేటీ సత్ఫలితాలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని సమస్యలకు పరిష్కారం లభించి, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యేలా చర్చలు సాగుతాయని ఆశిస్తున్నట్లు కిమ్ తెలిపారు.

ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్​తో రెండోసారి సమావేశమైన కిమ్​ ఎలాంటి పురోగతి లేకుండానే చర్చలు ముగించారు. అణ్వాయుధ ప్రయోగాలు విరమించాలని ఉత్తర కొరియాపై ట్రంప్​ ఎప్పటి నుంచో ఒత్తిడి తెస్తున్నారు. ఆ దేశంపై ఆంక్షలు విధిస్తున్నారు. రష్యా అధ్యక్షుడితో కిమ్​ భేటీ ఎలాంటి ఫలితాలిస్తుందో అనే అంశంపై ఆసక్తి నెలకొంది.

ఇదీ చూడండి: బాంబు పేలుళ్లతో శ్రీలంక ఉన్నతాధికారులపై వేటు!

Last Updated : Apr 25, 2019, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details