తెలంగాణ

telangana

ETV Bharat / international

తుపాకుల అమ్మకాలపై న్యూజిలాండ్ సర్కార్ నిషేధం

న్యూజిలాండ్​లో అసాల్ట్​, సెమీ ఆటోమెటిక్​ రైఫిళ్ల అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని  జెసిండా ఆర్డెర్న్‌ ప్రకటించారు. ఈ నెల 15న న్యూజిలాండ్​ క్రైస్ట్​చర్చ్​లోని జంట మసీదులపై ఉగ్రదాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

న్యూజిలాండ్​లో అసాల్ట్​ రైఫిళ్ల అమ్మకాలపై నిషేధం

By

Published : Mar 21, 2019, 11:02 AM IST

Updated : Mar 21, 2019, 6:03 PM IST

న్యూజిలాండ్​లో అసాల్ట్​ రైఫిళ్ల అమ్మకాలపై నిషేధం
న్యూజిలాండ్​లోని క్రైస్ట్ చర్చ్​లో జంట మసీదులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. అసాల్ట్​ సహా సెమీ ఆటోమెటిక్ రైఫిళ్ల అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్.

"మిలిటరీ రకానికి చెందిన సెమీ ఆటోమెటిక్ రైఫిళ్లను న్యూజిలాండ్​లో నిషేధిస్తున్నాం. అన్ని రకాల అసాల్ట్​ రైఫిళ్లపై నిషేధం ఉంటుంది. "జెసిండా ఆర్డెర్న్‌​, న్యూజిలాండ్ ప్రధాని.

చట్టం రూపొందించే వరకు రైఫిళ్ల అమ్మకాలను నిషేధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు ప్రధాని స్పష్టం చేశారు.

ఈ నెల 15న జరిగిన ఉగ్రదాడిలో 50 మంది మృతిచెందారు.

Last Updated : Mar 21, 2019, 6:03 PM IST

ABOUT THE AUTHOR

...view details