తెలంగాణ

telangana

ETV Bharat / international

నేపాల్​లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఎన్​సీ!

నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోవడం వల్ల నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. పుష్ప కమల్ దాహల్​-ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్​-ఎంసీతో పాటు, జేఎస్​పీఎన్​ల మద్దతును కూడగట్టనున్నట్లు పేర్కొంది.

Nepali Congress to stake claim
నేపాల్​లో ఎన్సీ ప్రభుత్వం!

By

Published : May 12, 2021, 5:28 PM IST

నేపాల్​లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్​(ఎన్​సీ) సిద్ధమవుతోంది. ప్రధాని కేపీ శర్మ ఓలీ విశ్వాస పరీక్షలో ఓడిపోవడం వల్ల కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీలకు గురువారం వరకు గడువిచ్చారు రాష్ట్రపతి విద్యా దేవి భండారీ. దీంతో పార్టీ బాధ్యులతో మంగళవారం సమావేశమైన షేర్ బహాదుర్​ దేయుబా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్​.. సీపీఎన్​-ఎంసీ, జేఎస్​పీఎన్​ల సభ్యుల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

మ్యాజిక్ ఫిగర్​ 136

నేపాల్ ప్రతినిధుల సభలో మొత్తం 271 స్ధానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 136 సభ్యుల మద్దతు అవసరం. ప్రధాన ప్రతిపక్షం ఎన్సీకి 61, పుష్ప కమల్​ దాహల్​ 'ప్రచండ' నేతృత్వంలోని నేపాల్​ కమ్యూనిస్టు పార్టీ మవోయిస్టు సెంటర్​(సీపీఎన్​-ఎంసీ)కు 49 సీట్లున్నాయి. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మరో 26 సభ్యుల మద్దతు అవసరమవుతుంది. జనతా సమాజ్​వాదీ పార్టీ నేపాల్​(జేఎస్​పీఎన్​)కు చెందిన 32 సభ్యుల మద్దతు కూడా తమకు లభిస్తుందని ఎన్​సీ భావిస్తోంది. సీపీఎన్​-యూఎంఎల్​లోని మాధవ్​ కుమార్​ నేపాల్​ వర్గం కూడా తమకు అండగా ఉంటుందని ఆశిస్తోంది.

ఎన్​సీకి మద్దతిచ్చే విషయమై జేఎస్​పీఎన్​లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఆ పార్టీలో మహంత ఠాకూర్​, రాజేంద్ర మహాతో వర్గానికి చెందిన 15 మంది సభ్యులు సోమవారం జరిగిన విశ్వాస పరీక్షకు దూరంగా ఉన్నారు. జేఎస్​పీఎన్​ సభ్యులు తమకు మద్దుతుగానే ఉంటారని ఆశిస్తున్నట్లు ఎన్​సీ జాయింట్​ జనరల్ సెక్రెటరీ ప్రకాశ్ శరణ్​ మహత్​ ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు పూర్తి మద్దతు ఉంటుందని పుష్ప కుమర్ దాహల్​ 'ప్రచండ' హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

వారితో రాజీనామా..

ఒకవేళ జేఎస్​పీఎన్ సభ్యులు​ తమకు అనుకూలంగా ఉండకపోతే సీపీఎన్-యూఎంఎల్​లోని మాధవ్​ కుమార్ వర్గానికి చెందిన 28 సభ్యులను మూకుమ్మడిగా రాజీనామా చేయించాలని ఎన్​సీ భావిస్తోంది. అప్పుడు ప్రతినిధుల సభలో సభ్యుల సంఖ్య 271నుంచి 243కి తగ్గుతుంది. ఎన్సీ, సీపీఎన్​-ఎంసీ, జేఎస్​పీఎన్​లోని 15 మంది సభ్యుల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమవుతుంది.

రాజకీయ సంక్షోభం..

గతేడాది డిసెంబర్ 20న నేపాల్ ప్రతినిధుల సభను ఓలీ సూచన మేరకు రాష్ట్రపతి విద్యా దేవి భండారీ రద్దు చేయడం వల్ల ఆ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. అనంతరం ఏప్రిల్​ 30, మే 10 ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్రపతి ప్రకటించారు. ఓలీ, ప్రచండ వర్గాల మధ్య ఆధిపత్య పోరు ముదిరి ఈ పరిస్థితులు తలెత్తాయి.

అయితే సభను అర్థాంతరంగా రద్దు చేయడాన్ని నేపాల్ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. మళ్లీ పునరుద్ధరించింది. మే 10న జరిగిన విశ్వాస పరీక్షలో ఓలీ నేతృత్వంలోని సీపీఎన్​-యూఎంఎల్​​ ఓడిపోయింది. ఓలీకి అనుకూలంగా 93 ఓట్లు రాగా.. 124 మంది సభ్యులు వ్యతిరేకించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details