తెలంగాణ

telangana

ETV Bharat / international

ఎవరెస్ట్ తాజా​ ఎత్తుపై మంగళవారం నేపాల్​ ప్రకటన

ఎవరెస్ట్​ శిఖరం తాజా ఎత్తును మంగళవారం ప్రకటిస్తామని వెల్లడించింది నేపాల్​. అలాగే.. ఎత్తుపై జరిపిన ఈ ప్రతిష్ఠాత్మ సర్వేలో పాల్గొన్న సిబ్బందిని సత్కరించనున్నట్లు తెలిపింది.

Mount Everest
మౌంట్​ ఎవరెస్ట్​

By

Published : Dec 7, 2020, 10:57 AM IST

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా పేరొందిన మౌంట్​ ఎవరెస్ట్​.. తాజా ఎత్తును ప్రకటించనున్నట్లు తెలిపింది నేపాల్​. ఏడాది పాటు సర్వే చేసిన గణాంకాలపై డిసెంబర్​ 8న ప్రకటించనున్నట్లు ఆ దేశ సర్వే విభాగం అధికారులు మీడియాకు సమాచారం అందించారు.

"ఎవరెస్ట్​ తాజా ఎత్తును ప్రకటించేందుకు మా కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నాం. ఈ సందర్భంగా సర్వేలో పాల్గొన్న సిబ్బందిని సత్కరించుకోనున్నాం. "

- సుశీల్​ నర్సింగ్​ రాజ్​భండారి, సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్​ జనరల్​.

2015లో వచ్చిన భూకంపంతో ఎవరెస్ట్​ ఎత్తు 8,848 నుంచి తగ్గిపోయిందన్న ఊహాగానాల నేపథ్యంలో సర్వే చేపట్టింది నేపాల్​. ఏడాది పాటు శిఖరం ఎత్తుపై సర్వే నిర్వహించారు అధికారులు. ఇందు కోసం చైనా సాయం తీసుకుంది. 2019లో చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ నేపాల్​ పర్యటన సందర్భంగా.. ఎవరెస్ట్​ కొత్త ఎత్తును సంయుక్తంగా ప్రకటించేందుకు ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

భారత సర్వే విభాగం 1954లో ఎవరెస్ట్​ ఎత్తును కొలిచి 8,848 మీటర్లుగా తేల్చింది. అప్పటి నుంచి అవే గణాంకాలు ప్రామాణికంగా ఉన్నాయి.

ఇదీ చూడండి: ఎవరెస్ట్ శిఖరం ఎత్తు తగ్గిందా? త్వరలో ప్రకటన!

ABOUT THE AUTHOR

...view details