భారత వార్తా ఛానెళ్లపై నిషేధాన్ని పాక్షికంగా తొలగించింది పొరుగు దేశం నేపాల్. ఈ మేరకు నేపాల్ టెలివిజన్ కేబుల్ ఆపరేటర్స్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అయితే పలు వార్తా ఛానెళ్లపై నిషేధం కొనసాగుతూనే ఉంది.
ఇరుదేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాల నేపథ్యంలో నేపాల్ జాతీయ భావాలకు భంగం కలిగే వార్తా కథనాలను ప్రసారం చేస్తున్నాయని ఆరోపిస్తూ ఈ నెల 9న భారత ఛానెళ్లపై నిషేధం విధించింది ఈ హిమాలయ దేశం. దూరదర్శన్ మినహా అన్ని ప్రైవేటు వార్తా ఛానెళ్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది నేపాల్ కేబుల్ టీవీ ఆపరేటర్స్ సంస్థ. ఈ నిర్ణయంపై ప్రశంసలు కురిపించింది నేపాల్ సర్కారు. భారత ఛానెళ్లపై చర్య తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేసింది.