తెలంగాణ

telangana

ETV Bharat / international

బరువు ఎక్కువున్నారని ఉద్యోగం నుంచి తీసేశారు..!

అధిక బరువు కారణంగా ఏడుగురు సైన్యాధికారులపై కఠిన చర్యలు తీసుకుంది నేపాల్​ సైన్యం. ముగ్గురు అధికారులకు పదోన్నతికి అర్హులు కారని తేల్చింది. మరో నలుగురును ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ మిషన్ విధుల నుంచి తొలగించింది.

బరువు ఎక్కువున్నారని ఉద్యోగం నుంచి తీసేశారు..!

By

Published : Aug 29, 2019, 7:08 PM IST

Updated : Sep 28, 2019, 6:43 PM IST


సాధారణంగా విధులు సరిగా నిర్వర్తించకపోయినా, అలసత్వం చూపినా ఉద్యోగులపై వేటు వేస్తుంటారు. అయితే బరువు అధికంగా ఉన్నారనే కారణంతో నేపాల్​ సైన్యం ఏడుగురు అధికారులపై వేటు వేసింది.

ముగ్గురు అధికారులకు పదోన్నతి రాకుండా ఆపింది. మరో నలుగురిని ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ మిషన్ విధుల్లో పాల్గొనకుండా తొలగించింది.

"వారి వారి బరువు మేరకు 3 నెలలు నుంచి 3 సంవత్సరాల వరకు తగ్గించుకునేందుకు గడువు ఇచ్చాము. ఇచ్చిన గడువు లోగా శరీర బరువు తగ్గించుకోకపోతే వారికి జరిమానా విధిస్తాము. వైద్య పరీక్షల్లో సిబ్బంది అనర్హులు అని తేలితే వారిని విధుల నుంచి తొలగిస్తాము. శారీరకంగా దృఢంగా ఉంటేనే శిక్షణ సమయాల్లో, అత్యవసర పరిస్థితుల్లో కార్యకలాపాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు."

-బిగ్యన్ దేవ్ పాండే, సైన్యాధికారి.

నేపాలీ సైన్యం తన సిబ్బందికి 2018 ఫిబ్రవరి 15 నుంచి ఆరోగ్య పరీక్షలను నిర్వహించడం ప్రారంభించింది.
శరీర ఆకృతిని కొలిచేందుకు ఊబకాయం, అధిక బరువు, సాధారణ బరువు, తక్కువ బరువు అనే నాలుగు గ్రూపులుగా వర్గీకరించింది.

బీఎమ్​ఐ

బీఎమ్​ఐ అంటే బాడీ మాస్​ ఇండెక్స్​. దీనిని శరీర బరువుని కొలిచేందుకు ఉపయోగిస్తారు.

బీఎమ్​ఐ 30 కన్నా ఎక్కువ ఉంటే అది ఊబకాయం, 25.25 నుంచి 29.9 లోపు ఉంటే అధిక బరువుగా పరిగణిస్తారు.

అదే విధంగా, 18.5 నుంచి 25.25 మధ్య ఉంటే అది సాధారణ బరువు. 18.5 కన్నా తక్కువ ఉంటే అది తక్కువ బరువుగా పేర్కొంటారు.

ఇదీ చూడండి : చిదంబరం పిటిషన్​పై సెప్టెంబర్​ 5న నిర్ణయం

Last Updated : Sep 28, 2019, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details