పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తిరిగి లాహోర్లోని కోట్ లఖ్పత్ జైలుకు చేరుకున్నారు. వైద్యం నిమిత్తం షరీఫ్ పొందిన ఆరు వారాల మధ్యంతర బెయిల్ గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. ఆల్ అజీజీయా మిల్స్ అవినీతి కేసులో నవాజ్ షరీఫ్ ఏడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
తమ నాయకుడు జైలుకు వెళుతున్నారని తెలిసి వందల మంది పాక్ ముస్లిం లీగ్ పార్టీ శ్రేణులు షరీఫ్ నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంటే జైలు వరకు వెళ్లారు. 30 నిమిషాల్లో జైలుకు చేరుకునే వీలున్నప్పటికీ అభిమానుల రాకతో నాలుగు గంటల సమయం పట్టింది. అర్ధరాత్రి వరకు ఆయనతోనే ఉండి మద్దతుగా నినాదాలు చేశారు అభిమానులు.
ఇదీ కేసు...