ఉత్తర కొరియా అణు సంపదపై ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఎంతో శ్రమించి కూడబెట్టుకున్న అణ్వాయుధాలతో దేశ భద్రతకు ఢోకా లేదని పేర్కొన్నారు. అణునిరాయుధీకరణ అంశం మీద అమెరికాతో చర్చలపై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో కిమ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కొరియన్ యుద్ధం(1950-53) 67వ వార్షికోత్సవం సందర్భంగా వీరులనుద్దేశించి ప్రసంగించారు కిమ్. దేశంలో ఉన్న అణు సంపదపై ఆధారపడవచ్చని.. రెండో కొరియన్ యుద్ధాన్ని నిరోధించగల సామర్థ్యం వాటికుందని వెల్లడించారు. దీంతో అణ్వాయుధాలను ఒదులుకోనని కిమ్ పరోక్షంగా మరోమారు ప్రపంచానికి తెలియజేశారు.