తెలంగాణ

telangana

ETV Bharat / international

బాలిస్టిక్​ క్షిపణులతో అమెరికాకు కిమ్ హెచ్చరిక

ఉత్తర కొరియా మరోమారు కవ్వింపు చర్యలకు దిగింది. రెండు బాలిస్టిక్​ క్షిపణులు ప్రయోగించింది. సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాలన్న అమెరికా- దక్షిణ కొరియా ప్రణాళికలను వ్యతిరేకిస్తూ ఈమేరకు హెచ్చరికలు చేసింది. అమెరికాతో చర్చలు కొనసాగవని తేల్చిచెప్పింది.

అమెరికాకు క్షిపణులతో కిమ్ మరో​ హెచ్చరిక

By

Published : Jul 31, 2019, 10:46 AM IST

Updated : Jul 31, 2019, 2:16 PM IST

బాలిస్టిక్​ క్షిపణులతో అమెరికాకు కిమ్ హెచ్చరిక

ఉత్తరకొరియా 250 కిలోమీటర్ల దూరం వెళ్లగలిగిన రెండు బాలిస్టిక్​ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా ఆరోపించింది. తాము అమెరికాతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు సిద్ధమవడంపై హెచ్చరికగానే ఈ క్షిపణులను ప్రయోగించిందని పేర్కొంది. తూర్పు తీరంలోని వాన్​సాన్ ప్రాంతం నుంచి క్షిపణులను వదిలినట్లు దక్షిణ కొరియా అధికారి ఒకరు వెల్లడించారు.

"కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు క్షిపణి పరీక్షలు సహాయం చేయవు. ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఉత్తర కొరియాను కోరుతున్నాం"

- దక్షిణ కొరియా ప్రకటన

ఉత్తర కొరియా క్షిపణులు ప్రయోగించకూడదని గతంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలు విధించింది. కానీ ఐరాస ఆదేశాలను ఉల్లంఘిస్తూ వారం వ్యవధిలో రెండోసారి ప్రయోగం చేసిందని సమాచారం.

గత నెలలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో కిమ్ జోంగ్ ఉన్ భేటీ అయ్యారు. ఇంతలోనే క్షిపణిని ప్రయోగించడం ఇరు దేశాల సంబంధాలను మరోమారు సందిగ్ధంలో పడేసింది.

సంయుక్త సైనిక విన్యాసాలు నిలిపివేతకే...

దక్షిణ కొరియాతో సంయుక్త విన్యాసాలను నిలిపివేయాలని కోరినప్పటికీ వినని కారణంగా అమెరికాతో చర్చలు కొనసాగే అవకాశం లేదని స్పష్టం చేసింది కిమ్​ దేశం.

"సంయుక్త ఆపరేషన్లు నిలిపివేయాలి. లేదంటే మా సైనిక సామర్థ్యాన్ని చూపాల్సి ఉంటుంది. నెమ్మదిగా ఉద్రిక్తతలు పెరిగే అవకాశమూ ఉంది."

-హార్రీ ఖజియానిస్, ఉత్తర కొరియా ప్రతినిధి

ఇదీ చూడండి: కాఫీడే సిద్ధార్థ మృతి- నది ఒడ్డున మృతదేహం

Last Updated : Jul 31, 2019, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details