తెలంగాణ

telangana

ETV Bharat / international

మరోమారు ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు!

ఉత్తర కొరియా తాజాగా స్వల్ప లక్ష్యాల్ని ఛేధించగల క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా వెల్లడించింది. రెండు క్షిపణులు ప్రయోగించారని దక్షిణ కొరియా మీడియా స్పష్టం చేసింది.

By

Published : Jul 25, 2019, 7:04 AM IST

Updated : Jul 25, 2019, 7:46 AM IST

మరోమారు ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు!

దాదాపు రెండు నెలల పాటు మౌనంగా ఉన్న ఉత్తర కొరియా మరోమారు క్షిపణుల ప్రయోగం చేపట్టింది. స్వల్ప లక్ష్యాల్ని ఛేదించగల రెండు క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా ప్రకటించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా మీడియా ధ్రువీకరించింది.

ఆగస్టులో అమెరికా-దక్షిణ కొరియా మిలటరీ ప్రదర్శనలు ఉన్న నేపథ్యంలో ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగానికి సాహసించిందని అనుమానిస్తున్నారు. అణు నిరాయుధీకరణ చర్చలపై ప్రభావం పడుతుందని హెచ్చరించేందుకే ప్రయోగించారని భావిస్తున్నారు.

ఉత్తర కొరియా స్థానిక కాలమానం ప్రకారం మొదటి క్షిపణిని ఉదయం 5:34, రెండోది 5:57 గంటల సమయంలో వోన్​సాన్​ నుంచి తూర్పు సముద్రంవైపు ప్రయోగించింది. ఈ క్షిపణులు సుమారు 430 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయని దక్షిణ కొరియా ప్రకటించింది.

ఉత్తర కొరియా చివరగా స్వల్ప లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను మే 9న ప్రయోగించింది. అమెరికా అధ్యక్షుడు జూన్​ 30న దక్షిణ కొరియాలోని డీఎం​జడ్​ (సైన్య రహిత జోన్​)లో కిమ్ ​జోంగ్​ ఉన్​తో భేటీ అయ్యారు. అణు నిరాయుధీకరణపై చర్చలు పునఃప్రారంభించారు. అనంతరం ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోగం చేపట్టలేదు ఉత్తర కొరియా.

ఇదీ చూడండి: బ్రిటన్​ ప్రధానిగా బోరిస్​ బాధ్యతల స్వీకరణ

Last Updated : Jul 25, 2019, 7:46 AM IST

ABOUT THE AUTHOR

...view details