మయన్మార్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం.. ప్రజలపై ఆంక్షలు అంతకంతకూ పెంచుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి ఫేస్‌బుక్‌ను నిషేధించిన సైన్యం శనివారం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను నిషేధించింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను పర్యవేక్షించే 'నెట్‌బ్లాక్స్' బృందం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. శనివారం ఉదయం నుంచి ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవని వారు తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా ఫేస్‌బుక్‌ను బ్లాక్ చేశామని చెప్పిన సైన్యం అదేవిధంగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లను కూడా నిషేధించింది. కాగా సామాజిక మాధ్యమాలను నిషేధించడంపై ఆయా కంపెనీలు స్పందించాయి. ఇది ప్రజల హక్కుల ఉల్లంఘనే అని వారు పేర్కొన్నారు.
మయన్మార్‌లో ఆందోళన- ఇంటర్నెట్ సేవలు బంద్ - మయన్మార్‌లో ఇంటర్నెట్ సేవలు
మయన్మార్ ప్రజలపై ఆ దేశ సైన్యం.. ఆంక్షలను కఠినతరం చేస్తోంది. ఇప్పటికే ఫేస్‌బుక్‌పై నిషేధం విధించగా.. శనివారం ఉదయం నుంచి ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. సామాజిక మాధ్యమాల్లో సైన్యం చర్యలపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నందునే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 1న సైన్యం తిరుగుబాటు చేసిన రోజు కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను నిషేధించిన సైన్యం తర్వాత దానిని పునరుద్ధరించింది. కాగా, సామాజిక మాధ్యమాల్లో సైన్యంపై వ్యతిరేకత పెరుగుతుండటం వల్ల ఇప్పుడు పూర్తిగా ఇంటర్నెట్‌ను నిషేధించారు. సైన్యం తిరుగుబాటు చేసినప్పటి నుంచి ఫేస్‌బుక్‌లో దానికి సంబంధించిన చిత్రాలు, నిరసనలు వెల్లువెత్తడం వల్ల సైన్యం.. ఫేస్‌బుక్‌పై నిషేధం విధించింది. గతేడాది నవంబరులో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాన్ సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్‌ఎల్డీ) పార్టీ అవకతవకలకు పాల్పడిందని సైన్యం ఆరోపించింది. వాటిపై అధికారపార్టీ సరైన రీతిలో స్పందించకపోవడం వల్ల తిరుగుబాటు చేసినట్లు సైన్యం వెల్లడించింది.
ఇవీ చదవండి: