తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆన్​లైన్​ బెగ్గింగ్​లో లక్షలు దండుకుని జైలు పాలైన మహిళ - online begging

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ద్వారా అడుక్కొనే పద్ధతి విస్తరిస్తోంది. కొందరు దర్బుద్ధితో తప్పుడు ప్రకటనలు చేస్తూ.. రూ.లక్షలు దండుకుంటున్నారు. దుబాయ్​లో ఇలాంటి కేసునే ఛేదించారు పోలీసులు. ఓ మహిళ 17 రోజుల్లోనే రూ.35 లక్షలు పోగుచేసి కటకటాల పాలైంది.

ఆన్​లైన్​ బెగ్గింగ్​: 17 రోజుల్లో 35 లక్షలు సంపాదించిన మహిళ

By

Published : Jun 10, 2019, 9:23 PM IST

సామాజిక మాధ్యమాల్లో ఓ చిన్న పోస్టు ద్వారా కుటుంబానికి అండగా నిలిచారనే వార్తలు చూస్తుంటాం. ఇలాంటి వాటిని అదునుగా చేసుకుని కొందరు దుర్బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. సోషల్​ మీడియాలో నా కుటుంబం ఆపదలో ఉంది.. ఆదుకోండంటూ తప్పుడు పోస్టులు పెడుతూ రూ.లక్షలు దండుకుంటున్నారు.

ఇలాంటి కేసు దుబాయిలో వెలుగు చూసింది. యూరప్​కు చెందిన ఓ మహిళ దుబాయిలో ఉంటూ ఆన్​లైన్​లో బెగ్గింగ్​ చేపట్టింది. 'నా భర్త విడాకులు ఇచ్చాడు. పిల్లలను పోషించటం భారంగా మారింది' అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి 17 రోజుల్లోనే సుమారు రూ.35లక్షలు సంపాదించింది. ప్రస్తుతం కటకటాల పాలైంది.

ఇన్​స్టాగ్రాం, ట్విట్టర్, ఫేస్​బుక్​ పోస్టుల ద్వారా ప్రజలను మోసగించి డబ్బు సంపాదించినట్లు తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆ మహిళ వివరాలు వెల్లడించలేదు.

" సామాజిక మాధ్యమాల్లో​ ఖాతాలు సృష్టించి తన పిల్లలను పోషించేందుకు భారంగా ఉందంటూ.. వారి చిత్రాలను పెట్టి అడుక్కునేది. ఈ పోస్టులను చూసి పలువురు ఆమెకు నగదు పంపించారు. ఆన్​లైన్​లో​ పోస్టులను చూసి విషయం తెలుసుకున్న బంధువులు ఆమె మాజీ భర్తకు తెలియజేశారు. తనపిల్లల ఫొటోలు పెట్టి ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఈ-క్రైమ్​ విభాగానికి సమాచారం అందించారు. తన పిల్లలు తనవద్దే ఉన్నారని నిరూపిస్తూ ఫిర్యాదు చేశారు."

-బ్రిగేడియర్​ అల్​ జల్లఫ్​, క్రైమ్​ విభాగం అధికారి

వీధుల్లో, ఆన్​లైన్​లో అడుక్కునేవారిని ప్రోత్సహించకూడదని కోరారు బ్రిగేడియర్​. ఆన్​లైన్​ ద్వారా అడుక్కోవడం నేరమని తెలిపారు. ఆన్​లైన్​ ద్వారా అడుక్కుంటే జైలు శిక్షతో పాటు 25 వేల నుంచి 50 వేల దిర్హామ్​ల వరకు జరిమాన విధించే అవకాశం ఉందని తెలిపారు.

ఇదీ చూడండి: పాకిస్థాన్​ మాజీ అధ్యక్షుడు జర్దారీ అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details