తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యా నిరసనలు: వెయ్యి మందికిపైగా అరెస్ట్​ - రష్యా

రష్యా రాజధాని మాస్కో నగర కౌన్సిల్​ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ సభ్యులను నిషేధించటాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు ప్రజలు. వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సుమారు వెయ్యి మందికిపైగా నిరసనకారులను అరెస్ట్​ చేశారు.

రష్యా నిరసనలు: వెయ్యి మందికిపైగా అరెస్ట్​

By

Published : Jul 28, 2019, 6:38 AM IST

Updated : Jul 28, 2019, 9:19 AM IST

రష్యా నిరసనలు: వెయ్యి మందికిపైగా అరెస్ట్​
రష్యా రాజధాని మాస్కో నగర కౌన్సిల్​ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ సభ్యులను పోటీ చేయకుండా అడ్డుకోవడాన్ని నిరసిస్తూ వేల మంది వీధుల్లోకి చేరి నిరసనలు చేపట్టారు. న్యాయమైన ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్​ చేశారు.

ఎలాంటి అనుమతులు లేకుండా ఆందోళనలు చేపట్టడం వల్ల పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిరసనకారులపై లాఠీ ఛార్జ్​ చేసి.. 1,074 మందిని అరెస్ట్​ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. రాజధాని నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నిరసన ప్రదర్శన ప్రసారం చేసిన ఓ టెలివిజన్​ ​కేంద్రాన్ని తనిఖీ చేశారు.

సెప్టెంబర్​లో జరగబోయే నగర కౌన్సిల్​ ఎన్నికల్లో పోటీకి ప్రతిపక్షాల సభ్యులను అనుమతించాలని సుమారు 22 వేల మంది గతవారం ఆందోళన చేశారు.

ఇదీ చూడండి: చైనాలో ఘనంగా 'భోగి పండుగ'...!

Last Updated : Jul 28, 2019, 9:19 AM IST

ABOUT THE AUTHOR

...view details