భారత్-నేపాల్ దేశాల మధ్య రెండో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ అందుబాటులోకి వచ్చింది. జోగ్బానీ బిరాట్‌నగర్ చెక్‌పోస్ట్‌ను భారత్, నేపాల్ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, కేపీ శర్మఓలీ దృశ్య మాద్యమం ద్వారా సంయుక్తంగా ప్రారంభించారు. భారత ప్రభుత్వ సహకారంతో రూ.140 కోట్ల వ్యయంతో 260 ఎకరాల్లో ఈ చెక్‌పోస్ట్ నిర్మించారు. ఈ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ ద్వారా రోజూ 500 ట్రక్కుల వరకు రాకపోకలు సాగించవచ్చు.
భారత్-నేపాల్ మధ్య రెండో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ ప్రారంభం 2018లో తొలి చెక్‌పోస్ట్
భారత్ నేపాల్ మధ్య రాకపోకలు, వర్తకాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ చెక్‌పోస్ట్ నిర్మాణం చేపట్టారు. మొదటి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను.. రక్సౌల్- బిర్గునీ వద్ద 2018లో ప్రారంభించారు. ఈ సందర్భంగా వీడియో లింక్ ద్వారా నేపాల్ ప్రధానితో సంభాషించిన మోదీ.. ఆ దేశ సమగ్రాభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
భూకంప బాధితుల కోసం గోర్ఖా, నువాకోట్ ప్రాంతంలో నిర్మించి ఇస్తామన్న 50 వేళ ఇళ్లలో 45 వేళ ఇళ్లు పూర్తయినట్లు.. నేపాల్ ప్రధానికి తెలియజేశారు మోదీ.
ఇదీ చూడండి: 'ఆపరేషన్ కశ్మీర్'లో కేంద్రం తదుపరి వ్యూహం ఏంటి?