ఇండోనేసియా, బ్రెజిల్, టర్కీ దేశాధ్యక్షులతో ప్రధాని నరేంద్రమోదీ వేర్వేరుగా సమావేశం అయ్యారు. జీ-20 సదస్సులో భాగంగా ప్రత్యేకంగా జరిగిన ఈ భేటీల్లో దేశాల మధ్య పరస్పర వాణిజ్య సంబంధాలపై చర్చించారు.
ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతో భేటీలో వివిధ అంశాలను ప్రస్తావించారు మోదీ. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సముద్ర రవాణా రంగాల్లో సంబంధాల బలోపేతం చేసే మార్గాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ భేటీ తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోతో సమావేశం అయ్యారు మోదీ. వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయం, జీవ ఇంధనాలపై సమాలోచనలు జరిపారు.
అనంతరం టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయీప్ ఎర్డోగాన్‌తో భేటీ అయ్యారు.