తెలంగాణ

telangana

ETV Bharat / international

"మీ దోషులు మాకొద్దు"

గృహ హింస కేసుల్లో శిక్ష పడ్డ విదేశీయులను తమ దేశంలోకి అనుమతించకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించింది. ఇప్పటికే దేశంలో ఉన్నవారిని పంపించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఇమిగ్రేషన్​ మంత్రి డేవిడ్​ కోల్​మ్యాన్​ తెలిపారు.

"మీ దోషులు మాకొద్దు"

By

Published : Mar 3, 2019, 12:52 PM IST

విదేశీ నేరస్థులపై ఆస్ట్రేలియా చర్యలను వేగవంతం చేసింది. మహిళలు, చిన్నారులను హింసించే కేసుల్లో 12 నెలల లేదా అంతకంటే ఎక్కువ కాలం శిక్ష పడ్డవారిని దేశంలోకి రానీయకుండా నిషేధం విధించింది. ఇప్పటికే దేశంలో ఉన్నవారిని పంపించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఇమిగ్రేషన్​ మంత్రి డేవిడ్​ కోల్​మ్యాన్​ తెలిపారు.

గతంలో ఇలాంటి కేసులో శిక్షపడ్డ అమెరికన్​ గాయకుడు క్రిస్​ బ్రౌన్​, బాక్సింగ్​ స్టార్​ ప్లాయిడ్​ మేవెదర్​లకు వీసా నిరాకరించింది ఆస్ట్రేలియా.

కొంత కాలం క్రితం జైలు శిక్ష పూర్తైన న్యూజిలాండ్​కు చెందిన నేరస్థులను స్వదేశానికి పంపించింది ఆస్ట్రేలియా. ఇందులో కొందరు తమ జీవిత కాలంలో ఎక్కువ భాగం ఇక్కడి జైళ్లలోనే గడిపారు. తిరిగి పంపించి వేయటంపై కివీస్​ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ABOUT THE AUTHOR

...view details