తెలంగాణ

telangana

ETV Bharat / international

మూగజీవుల గురించీ కాస్త ఆలోచించండి..!

పర్యావరణానికి మనిషి చేస్తున్న విధ్వంసం మూగజీవాల ప్రాణాల మీదకు తెస్తోంది. ఆస్ట్రేలియాలోని మెల్​బోర్న్​ నగర తీరంలో జనం పడేసే చెత్తాచెదారం మూలంగా అభంశుభం తెలియని సముద్ర జీవులు అన్యాయంగా బలవుతున్నాయి.

కాస్త మూగజీవుల గురించి కూడా ఆలోచించండి

By

Published : Jul 22, 2019, 7:02 AM IST

మూగజీవుల గురించీ కాస్త ఆలోచించండి..!

ఆస్ట్రేలియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మెల్​బోర్న్​ ఒకటి. ఇక్కడ సముద్రతీరంలో సీల్స్​ కాలనీ ఉంది. రోజూ ఎంతో మంది సందర్శకులు అక్కడికి వస్తుంటారు. కొంతమంది చేపలు కూడా పడుతుంటారు. వారు పడేసిన ప్లాస్టిక్​ కవర్లు, బాటిళ్లు, తీగలు, చెత్తా చెదారానికి కొన్ని సీల్స్​ బలైపోతున్నాయి. దీనికితోడు ఏటా విస్తరిస్తున్న జనాభాతో పాటు నగరంలో చెత్తాచెదారం సైతం కుప్పలు తెప్పలుగా పేరుకుపోతోంది.

ఈ వ్యర్థాలు ప్రమాదకరంగా మారి గాయాలపాలవుతున్న సీల్స్​ను రక్షించేందుకు మెల్​బోర్న్​ మెరైన్​ జూ బృందం తీవ్రంగా కృషిచేస్తోంది. వాటికి చికిత్సను అందిస్తోంది. పూర్తిగా దెబ్బతిన్న వాటిని జూకు తీసుకెళ్లి సర్జరీ చేసి మరీ వాటి బాగోగులు చూస్తున్నారు. వీళ్లకు పోర్ట్​ ఫిలిప్​ తీరంలో ఓ సీల్ పిల్ల తీవ్రంగా గాయపడి కనిపించింది.

"యుక్త వయస్సులో ఉన్న జంతువులకు ఇది పెరిగే దశ. కాబట్టి అవి త్వరగా బరువు పెరుగుతాయి. చుట్టూ చిక్కుకున్న తీగల నుంచి అవి తప్పించుకోలేవు. అలాగే మోనోఫిలమెంట్స్​ చాలా దృఢంగా ఉండటం వల్ల అవి వాటి మెడని తెగేలా చెయ్యగలవు."

-మార్క్​ కీనన్​, మెరైన్​ ప్రతిస్పందన బృందం సభ్యుడు

సముద్రంలో గాయాలపాలైన జీవరాసులకు సాయం అందించమని మెరైన్​ జూ ప్రతిస్పందన బృందానికి గత ఏడాది 470 ఫోన్​ కాల్స్​ వచ్చాయి. ఈ సారి అది 34 శాతం పెరిగింది.

మానవుల తప్పిదాల కారణంగా దెబ్బతింటున్న సీల్స్​తో పాటు... బాతులు, హంసలు, తాబేళ్లు, తిమింగలాలు, పెంగ్విన్లు, డాల్ఫిన్లకు కూడా ఈ బృందం చికిత్స అందిస్తుంది.

మూగజీవాల ప్రాణాల విలువను గ్రహించి పర్యావరణ పరిరక్షణకు అంతా పాటుపడితే ప్రకృతి రమణీయతను కాపాడొచ్చు.

ABOUT THE AUTHOR

...view details