థాయ్‌లాండ్‌లోని 'ఫిఫిలే' ద్వీపంలో ఉన్న 'మాయా' బీచ్‌ను సందర్శించాలనుకుంటున్న వారికి చేదు వార్త చెప్పింది అక్కడి ప్రభుత్వం. ఇప్పుడున్న పర్యటక నిషేధ గడువున మరింత కాలం పొడిగించింది. 2021 వరకు బీచ్‌లోకి పర్యటకులకు అనుమతి లేదని ప్రకటించింది.
గత కొన్నేళ్లుగా ఈ సుందరమైన సముద్ర తీరాన్ని చూసేందుకు దేశవిదేశాల నుంచి పెద్దసంఖ్యలో యాత్రికులు వస్తున్నారు. ఫలితంగా ఇక్కడి తీరప్రాంత పర్యావరణం పూర్తిగా దెబ్బతింది. తిరిగి మామూలు స్థితికి వచ్చేందుకు మరింత సమయం పడతుందనే కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.
చూపరులను కట్టిపడేసే సహజసిద్ధ వనరులు, చక్కటి తీరప్రాంతం, సూది వేసినా కనిపించేంత స్పష్టంగా ఉండే సముద్ర జలంతో కూడిన మాయాబీచ్... థాయ్‌లాండ్‌లోని పర్యటక ప్రాంతాల వరుసలో ముందు ఉంటుంది. అందుకే ఈ చూడచక్కని సముద్ర తీరాన్ని సందర్శించేందుకు ప్రతిరోజు సరాసరి 4 వేల మందికి పైగా పర్యటకులు వస్తుంటారు. కేవలం 2018లోనే 25 లక్షల మంది ప్రజలు ఈ తీరప్రాంతాన్ని సందర్శించారని థాయ్‌లాండ్ అధికారులు తెలిపారు. బీచ్ సందర్శన పునఃప్రారంభమయ్యాక కూడా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని రోజుకు 2 వేల మంది పర్యటకులను మాత్రమే అనుమతించాలని థాయ్ ప్రభుత్వం భావిస్తోంది.
గతేడాదే పర్యటకులకు నో ఎంట్రీ