అసలే కరోనా కాలం. విమాన ప్రయాణాలు చేయాలంటే.. ఎన్నో ఆంక్షలు. అయితే.. ఈ ఆంక్షల నుంచి తప్పించుకుని వేరే ప్రాంతానికి వెళ్దామనుకున్న ఓ వ్యక్తి.. అతి తెలివి ప్రదర్శించాడు.
అసలేం జరిగింది?
కరోనా సోకినప్పటికీ.. ఇండోనేసియాకు చెందిన ఓ వ్యక్తి వేరే ప్రాంతానికి వెళ్లాలనుకున్నాడు. అందుకు తన భార్యలా వేషాన్ని మార్చుకున్నాడు. బురఖా వేసుకుని, భార్య గుర్తింపు కార్డును, ఆమెకు కరోనా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించగా వచ్చిన నెగెటివ్ రిపోర్టును పెట్టుకుని, జకార్తా నుంచి మలుకు దీవుల్లోని టెర్నేట్కు విమాన ప్రయాణం చేశాడు. అయితే.. అతడు బాత్రూంలో బట్టలు మార్చుకుని బయటకు వస్తుండగా అధికారులు పసిగట్టారు.
"తన భార్య పేరు మీద అతడు విమాన టికెట్ కొనుక్కున్నాడు. ఆమె గుర్తింపు కార్డే తెచ్చుకున్నాడు. తన భార్య పేరు మీదనే పీసీఆర్ పరీక్ష ఫలితం సహా టీకా తీసుకున్నట్లు ధ్రువపత్రం తెచ్చుకున్నాడు. మిగతా అన్ని పత్రాలను తన భార్య పేరు మీదవే."