తెలంగాణ

telangana

ETV Bharat / international

రెండు రైళ్లు ఢీ- 200 మందికి గాయాలు

మలేసియాలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 200 మందికి పైగా గాయాలయ్యాయి.

collision
ప్రమాదం

By

Published : May 25, 2021, 10:05 AM IST

మలేసియాలో ఘోర ప్రమాదం జరిగింది. సొరంగ మార్గంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. దీంతో 200 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. పెట్రోనాస్ టవర్స్​కు సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

అయితే ఈ ప్రమాదంలో 40 మంది తీవ్రంగా గాయపడ్డట్లు, 160 మందికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. రైళ్లలో సమాచార లోపం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి:చైనా- ఇరాన్​ ఒప్పందం- భారత విధానాలకు ముప్పు!

ABOUT THE AUTHOR

...view details