తూర్పు ఇండోనేషియా మలుకు దీవిలో భారీ భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై 7.3 తీవ్రత నమోదయింది. భూప్రకంపనలతో భయభ్రాంతులకు గురయిన ప్రజలు ఇళ్లల్లో నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. ప్రస్తుతానికి సునామీ హెచ్చరికలేమీ జారీ కాలేదు.
ఉత్తర మలుకు రాష్ట్రంలోని టెర్నేట్ నగరానికి నైరుతి ప్రాంతంలో 165 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.