తెలంగాణ

telangana

ETV Bharat / international

వాళ్లొస్తున్నారని 'రెడ్​ లైట్​ ఏరియా' బంద్ - Osaka

జపాన్​లో జీ20 సదస్సు జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక నిర్ణయం తీసుకున్నాయి అక్కడి శృంగార కేంద్రాలు. సమావేశం జరిగే ఒసాకా నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చాయి.

వాళ్లొస్తున్నారని 'రెడ్​ లైట్​ ఏరియా' బంద్

By

Published : May 16, 2019, 5:48 PM IST

చరిత్రలో తొలిసారి జీ20 సదస్సుకు అతిథ్యమివ్వనున్న జపాన్​ ప్రతిష్ఠను మరింత పెంచేలా ప్రత్యేక నిర్ణయం తీసుకున్నాయి అక్కడి శృంగార కేంద్రాలు. సదస్సు జరగనున్న ఒసాకా నగర చుట్టుపక్కల ప్రాంతాల్లోని శృంగార కేంద్రాలకు తాత్కాలికంగా తాళాలు వేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చాయి. రెడ్​ లైట్​ ఏరియా ప్రతినిధులతో కూడిన 'తోబిట షించి అసోషియేషన్'​ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది.

భారత్​, అమెరికా,చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్​ సహా ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సుకు ఎలాంటి అంతరాయం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

"జీ20 సదస్సు చాలా పెద్ద కార్యక్రమం. ఈ సమావేశానికి హాజరయ్యే ఇతర దేశాల ప్రతినిధులకు ఏ చిన్న సమస్య తలెత్తినా అది సదస్సుకు అంతరాయం కలిగిస్తుందని మేం భావించాం. అందుకే శృంగార కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించుకున్నాం."
-తోబిట షించి అసోషియేషన్ ప్రతినిధి

ప్రపంచ అగ్రదేశాలు పాల్గొనే జీ20 సదస్సు... జూన్​ 28, 29 తేదీల్లో జపాన్​లో రెండు రోజుల పాటు జరగనుంది.

గతంలోనూ ఇలా...

గతంలోనూ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాయి జపాన్​లోని శృంగార కేంద్రాలు. 1995లో జరిగిన 'ఆసియా పసిఫిక్​ ఎకనామిక్​ కో-ఆపరేషన్'​ సదస్సును ఒసాకాలోనే నిర్వహించింది జపాన్ ప్రభుత్వం​. ఈ సమావేశం సందర్భంగా నగర చుట్టుపక్కలున్న కొన్ని శృంగార కేంద్రాలు స్వచ్ఛందంగా కార్యకలాపాలు నిలిపివేశాయి. గతంలో కొన్ని మాత్రమే ఇందుకు ముందుకు రాగా ఇప్పుడు దాదాపు అన్ని కేంద్రాలు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేయనున్నాయి.

ఇదీ చూడండి : లాభాలు అదుర్స్... మెరిసిన ఆర్థిక, ఐటీ షేర్స్

ABOUT THE AUTHOR

...view details