తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రమాదం అంచుల్లో అతిపెద్ద బల్లులు - కొమొడో డ్రాగన్​

నోటి నుంచి నిప్పులు కురిపించే డ్రాగన్​ అంటే మనకు గుర్తువచ్చేది... 'గేమ్​ ఆఫ్ థ్రోన్స్' టీవీ కార్యక్రమం. అయితే అది కల్పితం. మనం చూడగలిగే నిజమైన డ్రాగన్​కు​ లండన్​ జూ వేదిక. వీటికి రెక్కలు ఉండవు. నిప్పులు కక్కలేదు. అంతే తేడా.

ప్రమాదం అంచుల్లో అతిపెద్ద బల్లులు

By

Published : May 7, 2019, 2:16 AM IST

కొమోడో డ్రాగన్

'గేమ్​ ఆఫ్ థ్రోన్స్​' అనగానే మనకు చాలా యాక్షన్​ సన్నివేశాలు గుర్తొస్తాయి. వాటిలో 'రీగల్​, వైసీరియన్'​ డ్రాగన్ పోరాట దృశ్యాలు ప్రత్యేకం. అవి కల్పితాలే అయినా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాయి. లండన్​ జూలోనూ ఓ నిజమైన డ్రాగన్​ ఉంది. అయితే ఈ కొమోడో డ్రాగన్​ నిప్పులు కక్కలేదు, ఎగరలేదు.

అందుకే ఆ పేరు...

బల్లి జాతిలో ఇంకా మనుగడ సాగిస్తున్న అతిపెద్ద జీవి కొమోడో. ఇండోనేసియాలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడి దీవి పేరు మీదుగా కొమోడో డ్రాగన్​(ఉడుము)గా పిలుస్తున్నారు. వీటిలో అతి పెద్దవి సుమారు 3 మీటర్ల వరకు పెరుగుతాయి. నాలుకతోనే వాసనను గుర్తిస్తాయి. 9 కిలోమీటర్లు దూరంలో ఉన్నా ఆహారాన్ని పసిగట్టే శక్తి వీటి సొంతం.

11ఏళ్ల వయసున్న గణాస్​ కూడా ఇండోనేసియా నుంచే లండన్​కు వచ్చింది. 2015 నుంచి 'అటెన్​బరో కొమోడో డ్రాగన్​ హౌస్​'లో నివసిస్తోంది ఈ ఉడుము.

"భూమధ్య రేఖకు దగ్గరి దీవులే వీటి అసలైన నివాస స్థానాలు. అక్కడ వేడి ఎక్కువ, గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. మాకు సాధ్యమైనంతలో అలాంటి వాతావరణాన్ని సృష్టించి రక్షించగలుగుతున్నాం. "
-డేనియల్ కేన్​, గణాస్​ సంరక్షకుడు

తగ్గుతున్న సంఖ్య

కమోడోల మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. నానాటికీ వీటి సంఖ్య తగ్గుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 5 వేలు మాత్రమే. అందుకు కారణం అడవుల దురాక్రమణే. అడవులతో అక్రమ వ్యాపారమూ ఈ జాతి హననానికి మరో కారణమంటున్నారు లండన్​ జూ పర్యవేక్షకుడు జో కేపన్​.

"9 కోట్ల సంవత్సరాల్లో జీవి మనుగడను చూస్తే.. కొమోడోలే చాలా కాలం స్థిరంగా జీవించాయి. 16వ శతాబ్దంలో ఇండోనేసియాకు డచ్​, పోర్చుగీసు వారు వలసలకు వెళ్లినప్పుడు వీటిని గుర్తించారు. అప్పటివరకూ చరిత్ర పాఠాల్లో మాత్రమే ఉండేవి. ఇప్పుడు అదే జరగతుందేమో?"
- జో కేపన్, జూ పర్యవేక్షకుడు

అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సమాఖ్య(ఐయూసీఎన్​) కమోడోల సంఖ్య తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేసింది.

ABOUT THE AUTHOR

...view details