దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమది కరోనా ఫ్రీ దేశమని ఉత్తర కొరియా చేసిన ప్రకటనపై అనుమానం వ్యక్తం చేస్తూ దక్షిణ కొరియా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే దక్షిణ కొరియా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కిమ్ యో జాంగ్.
ఉత్తర కొరియాలో కరోనా కేసులు లేవంటే నమ్మడం చాలా కష్టంగా ఉందని ఇటీవలే ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి కాంగ్ క్యూంగ్. కరోనా సంక్షోభంలో సహాయం చేస్తామన్న తమ ప్రతిపాదనపై కిమ్ ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:-కిమ్ జోంగ్ చెల్లెలు అంత శక్తిమంతమా?
ఈ వ్యవహారంపై కిమ్ యో జాంగ్ మండిపడ్డారు.