తెలంగాణ

telangana

ETV Bharat / international

కిమ్​ అధ్యక్షతన కీలక సమావేశం.. ఈసారి ఏం చేస్తారో? - Kim key meeting North Korea

Kim key meeting North Korea: వివిధ ప్రాజెక్టులను సమీక్షించడం, నూతన విధానాలతో పాటు అమెరికాతో నెలకొన్న ప్రతిష్ఠంభనపై చర్చించేందుకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైంది. ఇదే వేదికపై గతంలో కిమ్​ పలు కీలక ప్రకటనలు చేశారు. ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

kim key meeting in north korea
కిమ్​ అధ్యక్షత కీలక సమావేశం.. ఈసారి ఏం చేస్తారో?

By

Published : Dec 28, 2021, 12:30 PM IST

Kim Jong Un latest meeting: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​ నేతృత్వంలో.. అధికార వర్కర్స్​ పార్టీ సెంట్రల్​ కమిటీకి చెందిన ప్లీనరీ సమావేశం ప్రారంభమైంది. గతంలో ఇదే వేదికపై.. అమెరికాతో బంధం, దేశ అణ్వస్త్ర కార్యక్రమాలపై కిమ్​ కీలక ప్రకటనలు చేశారు. ఈసారి ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధ్యక్షుడిగా కిమ్​.. తన 10ఏళ్ల పాలనను ఇటీవలే పూర్తి చేసుకున్న తరుణంలో భేటీ జరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

కిమ్​ జోంగ్​ ఉన్​
సమావేశంలో ప్రసంగిస్తున్న కిమ్​

వివిధ ప్రాజెక్టులను సమీక్షించేందుకు, కొవిడ్​ మహమ్మారి నేపథ్యంలో నూతన విధానాలపై చర్చించేందుకు, అమెరికాతో నెలకొన్న ప్రతిష్ఠంభనపై సమాలోచనలు చేసేందుకు.. ఈ ప్లీనర్​ సమావేశం సోమవారం ప్రారంభమైంది. భేటీ ముగింపు తేదీపై స్పష్టత లేదు. 2019లో జరిగిన ప్లీనరీ సమావేశం.. నాలుగు రోజుల పాటు సాగింది.

సమావేశంలో పాల్గొన్న అధికారులు
సమావేశంలో పాల్గొన్న అధికారులు

దేశ విధానాలను రూపొందించడంలో ఈ ప్లీనరీది కీలక పాత్ర! తాజా సమావేశంలో పాల్గొన్న సభ్యులు.. పలు అజెండాలను ఆమోదించి, వాటిపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన వివరాలు, ఫొటోలను ఉత్తర కొరియా అధికార మీడియా విడుదల చేసింది.

కిమ్​ అధ్యక్షతన సమావేశం

ఇదీ చూడండి:-కిమ్​ దశాబ్ద పాలన- హత్యలు, ఆకలి కేకలు, అణచివేతలు

ABOUT THE AUTHOR

...view details