నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ.. శుక్రవారం మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్లో విశ్వాస పరీక్షలో ఓడిపోయిన కొద్ది రోజులకే ఆయన మళ్లీ ప్రధాని పదవి చేపట్టడం గమనార్హం. శీతల్ నివాస్ వద్ద జరిగిన కార్యక్రమంలో కేపీ శర్మతో ఆ దేశ అధ్యక్షురాలు విద్యా దేవీ భండారీ ప్రమాణం చేయించారు.
నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకుగాను ప్రతిపక్షాలు మెజార్టీ సాధించలేక విఫలమవ్వగా.. కేపీ శర్మ ఓలీకే మరోసారి ప్రధానిగా అవకాశమిచ్చారు అధ్యక్షురాలు విద్యా దేవీ భండారీ. నేపాల్ రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం.. ప్రమాణ స్వీకారం చేసిన 30 రోజుల్లోగా కేపీ శర్మ ఓలీ.. విశ్వాస పరీక్షలో నెగ్గాల్సి ఉంటుంది.