తెలంగాణ

telangana

ETV Bharat / international

ఒమిక్రాన్​కు చెక్​ పెట్టేందుకు నాలుగో డోసు- ఆ దేశంలో ట్రయల్స్​

Israel fourth dose: రోజురోజుకు విస్తరిస్తున్న ఒమిక్రాన్​ వేరియంట్​కు చెక్ పెట్టేందుకు కరోనా టీకా నాలుగో డోసు ట్రయల్స్​ను ప్రారంభించింది ఇజ్రాయెల్​. మొత్తం 150 మంది వైద్య సిబ్బందికి ఈ డోసు అందించింది. వీరంతా ఈ ఏడాది ఆగస్టులోనే బూస్టర్ డోసు(మూడో డోసు) తీసుకున్నారు.

ఇజ్రాయెల్​ నాలుగో డోసు టీకా, Israel trials 4rth dose of COVID-19 vaccine
ఒమిక్రాన్​కు చెక్​ పెట్టేందుకు ఆ దేశంలో ప్రజలకు నాలుగో డోసు టీకా

By

Published : Dec 27, 2021, 6:10 PM IST

Israel fourth dose: ఒమిక్రాన్​ వేరియంట్​ను నిలువరించేందుకు ప్రజలకు కరోనా టీకా నాలుగో డోసు ఇవ్వాలని భావిస్తోంది ఇజ్రాయెల్. ఇందులో భాగంగా మొదట 150మంది ఆరోగ్య సిబ్బందికి సోమవారం ఫైజర్ టీకా నాలుగో డోసు ఇచ్చింది. ఈ డోసుతో మరింత రక్షణ లభిస్తుందో లేదో ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. ఒకవేళ నాలుగో డోసు తీసుకున్నవారికి బలమైన రక్షణ లభిస్తుందని తేలితే దేశ ప్రజలందరికీ ఈ డోసు ఇవ్వనుంది. దీనిపై ఆరోగ్య శాఖ త్వరలో నిర్ణయం తీసుకుంటుంది.

నాలుగో డోసు తీసుకుంటున్న ఇజ్రాయెల్​ వైద్య సిబ్బంది

ట్రయల్స్​లో భాగంగా శెబా మెడికల్ సెంటర్​లో 150మంది వైద్య సిబ్బందికి నాలుగో డోసు వేశారు. వీరిలో యాంటీబాడీల స్థాయి తగ్గిందని పరీక్షల్లో తెలిసినందున మరోసారి బూస్టర్​ డోసు ఇచ్చారు. వీరంతా ఈ ఏడాది ఆగస్టులోనే బూస్టర్ డోసు(మూడో డోసు) తీసుకున్నారు.

నాలుగో డోసు తీసుకుంటున్న ఇజ్రాయెల్​ వైద్య సిబ్బంది

నాలుగో డోసుతో ఒమిక్రాన్​ నుంచి రక్షణ లభిస్తుందని ఈ ట్రయల్స్​తో తేలుతుందని తాము భావిస్తున్నట్లు వైద్య నిపుణుడు ప్రొఫెసర్​ జాకబ్ లావీ తెలిపారు. కచ్చితంగా యాంటీబాటీలు, టీ సెల్స్​ మరింత వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. నాలుగో డోసు తీసుకున్న వారి ఫలితాలను పరిశీలిస్తే దీనిపై స్పష్టమైన అవగాహన వస్తుందన్నారు.

Israel booster dose news

ఇజ్రాయెల్​లో ఇప్పటివరకు మొత్తం 13లక్షల 6వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 8,242మంది మరణించారు. మొత్తం 93 లక్షల జనాభా గల ఈ దేశంలో 42లక్షల మందికి ఇప్పటికే ఫైజర్​ టీకా బూస్టర్ డోసు ఇచ్చారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో నాలుగో డోసు ఇస్తున్నారు.

ఇదీ చదవండి:రెండేళ్లలో ఒకే ఒక్క కరోనా కేసు నమోదైన దేశాలేవో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details