ఇరాక్ నూతన సంవత్సర వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టైగ్రిస్ నదిలో జరిగిన ఘోరపడవ ప్రమాదంలో 100మందికి పైగాచనిపోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నట్లు ఇరాక్ అధికారవర్గాలు తెలిపాయి. కుర్దీష్ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని నౌరోజ్ వేడుకలు నిర్వహించారు. సంబరాల్లో పాల్గొనేందుకు పడవపై వెళ్తోన్న ప్రజలు మోసుల్ నగరానికి సమీపంలో ప్రమాదవశాత్తు నదిలో మునిగి చనిపోయారు.
పండుగ నాడు పడవ మునిగి 100మంది మృతి - టైగ్రిస్ నది
ఇరాక్ కుర్దీష్ కొత్త ఏడాది వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తోన్న పడవ ప్రమాదవశాత్తు టైగ్రిస్ నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 100 మందికిపైగా మృతి చెందారని అధికారులు తెలిపారు.
ఇరాక్‌లో పడవ ప్రమాaదం-71 మంది మృతి
పరిమితికి మించి పడవలో ప్రయాణించటమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. 19మంది చిన్నారులు సహా 55 మందిని రక్షించారు. ఆ ప్రాంతంలో ఎక్కువ పడవలు లేకపోవటం వల్ల మిగతా బాధితులను కాపాడలేకపోయినట్లు అధికారులు చెప్పారు.
Last Updated : Mar 22, 2019, 7:49 AM IST