యురేనియం శుద్ధిని వేగంగా చేపట్టేందుకు ఇరాన్ ప్రారంభించిన ఆధునాతన న్యూక్లియర్ సెంట్రిఫ్యూజ్ ఐర్-9 సైబర్ దాడికి గురైనట్లు తెలుస్తోంది. నతాంజ్‌లోని అణు కర్మాగారంలో యంత్రాన్ని పనిచేయించడం మెుదలుపెట్టిన కొద్ది గంటలకే అనూహ్యంగా అక్కడ విద్యుత్ పంపిణీ కుప్పకూలడాన్ని ఇజ్రాయెల్ సైబర్ దాడిగా అక్కడి మీడియా పేర్కొంది.
అణు కర్మాగారంలో విద్యుత్ సమస్య వల్ల నేలపై ఉన్న వర్క్‌షాప్‌లు, నేల మాళిగలోని అణుశుద్ధి యూనిట్లు సహా.. కర్మాగారం అంతటా విద్యుత్ నిలిచిపోయిందని ఇరాన్ అణు విభాగం అధికార ప్రతినిధి తెలిపారు. విద్యుత్ నిలిచిపోవటం చాలా అనుమానస్పదంగా ఉందని ఇరాన్ పార్లమెంటులోని ఇంధన కమిటీ అధికార ప్రతినిధి మాలెక్ షిరియాతి నియాసర్ అన్నారు. ఇది విద్రోహచర్య, చొరబాటును సూచిస్తోందని చెప్పారు.