తెలంగాణ

telangana

ETV Bharat / international

రోబో పరిశ్రమపై అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ ప్రభావం

అంతర్జాతీయ రోబొటిక్​ సదస్సుకు చైనా రాజధాని బీజింగ్​ వేదిక అయింది. శాస్త్ర, సాంకేతిక రంగాలైన విద్య, వైద్యం, వినోదం, నిర్మాణ రంగాల్లో మరమనిషి సామర్థ్యతను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. కానీ కొంత కాలంగా అమెరికా​-చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం, ప్రపంచ ఆర్థిక మాంద్యం రొబోటిక్స్​ పరిశ్రమపై ప్రభావం చూపుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.

By

Published : Aug 25, 2019, 8:01 PM IST

Updated : Sep 28, 2019, 6:00 AM IST

రోబో పరిశ్రమపై అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ ప్రభావం

రోబో పరిశ్రమపై అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ ప్రభావం

అమెరికా-చైనా మధ్య వాణిజ్యం యుద్ధం, ప్రపంచ ఆర్థిక మాంద్యం రోబొటిక్స్​ పరిశ్రమంపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. కొంత కాలంగా రోబోల తయారీ రంగం ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ తరుణంలో రోబో పరిశ్రమకు ఊతమిచ్చే ప్రయత్నం చేసింది చైనా. ప్రపంచ దేశాలలో తయారైన వివిధ రోబోలను ఒక్కతాటిపైకి తెచ్చింది. దేశ రాజధాని బీజింగ్​లో అతిపెద్ద అంతర్జాతీయ రోబోటిక్​ సదస్సు నిర్వహిస్తోంది. ఇక్కడ అన్ని రంగాల్లో వినియోగించే మరమనుషుల శక్తి, సామర్థ్యాలు ప్రదర్శితమవుతున్నాయి.

ఈ రోబోల ద్వారా వేల కిలోమీటర్ల దూరం నుంచి 5జీ రిమోట్ హ్యాండ్ సహాయంతో మనుషులకు శస్త్ర చికిత్స చేసే నమూనా, తక్కువ సమయంలో వాహన పరికరాలను సునాయసంగా బిగించడం, మిల్లీ మీటర్ల వ్యాసార్థం గల సూది మొనలో దారం దూర్చడం, చేతితో అందమైన ట్యాటులు వేయడం వంటివి ప్రదర్శిస్తూ అలరిస్తున్నాయి రోబోలు. అవే కాకుండా విద్య, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వీటి ఆవశ్యకతను తెలిపేలా పలు ప్రదర్శనలు చేపట్టారు ఇంజినీర్లు.

ఫ్రిబవరి నెలలో చైనాలో రోబొటిక్స్​ పరిశ్రమను ప్రోత్సహించేలా దేశ సెంట్రల్​ బ్యాంకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పరిశ్రమలకు ఎక్కువ రుణాలు మంజూరు చేయాలని రోబొటిక్స్​ కార్పొరేషన్లకు సూచించింది. కానీ అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వలన దేశంలోని రోబొటిక్​ తయారీపై ప్రభావం పడుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

"రోబోటిక్​ పరిశ్రమ క్షీణత ఆర్థికవ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు దీనికి కారణం. ఫలితంగా మొదలు పెట్టిన ప్రాజెక్ట్​లు ప్రారంభ దశలోనే ఆగిపోతున్నాయి."

-చిఫ్​ ఇంజినీర్​ ఆఫ్ యస్​క్వా షాగాంగ్​ రోబోట్​, జెంగ్​ కాంగ్​

2030 నాటికి 20 మిలియన్లు..

చైనాలో 2017లో 1,31,000, 2018 లో 1,47,700 రోబోలు తయారయ్యాయి. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ సంస్థ సర్వే ప్రకారం 2030 నాటికి ప్రపంచంలోని రోబోల జనాభా 20 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. చైనా ప్రభుత్వ మద్దతు ఉన్నప్పటికీ... రోబోల ఉత్పత్తి 2018 లో 8.5 శాతం పడిపోయిందని ఐఎన్జీ ఆర్థిక సంస్థ తెలిపింది.

ఇదీ చూడండి : కశ్మీర్​ అభివృద్ధిపై కేంద్రం కసరత్తు షురూ

Last Updated : Sep 28, 2019, 6:00 AM IST

ABOUT THE AUTHOR

...view details