కరోనా వ్యాప్తి నేపథ్యంలో దాదాపు ప్రజలందరూ ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఎక్కువగా సామాజిక మాధ్యమాలలోనే గడుపుతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్‌లపై సమయం వెచ్చిస్తున్నారు. ఇలాంటి వారి కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సరికొత్త ఛాలెంజ్ వచ్చింది.
'హ్యాండ్ జెస్ట్చర్ ఛాలెంజ్' పేరుతో ఓ సరికొత్త గేమ్ వైరల్ అవుతోంది. దీన్నే 'జెస్ట్చర్ ఛాలెంజ్' అని కూడా అంటారు.
ఎలా ఆడాలి?
ఈ ఛాలెంజ్‌లో తెరపై ఓ వరుస క్రమంలో చేతి ఎమోజీలు కనిపిస్తాయి. అక్కడ చూపిన విధంగా ఆ గుర్తులను మనం చేసి చూపించాలి. దీన్నే 'ఎమోజీ హ్యాండ్ ఛాలెంజ్' అని పిలుస్తారు. చూడటానికి ఎంతో సులభంగా ఉన్నా ఇందులో తప్పులు చేస్తూనే ఉంటారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ గేమ్‌ను నెటిజన్లు విపరీతంగా ఆడుతున్నారు.