తెలంగాణ

telangana

ETV Bharat / international

ద్వైపాక్షిక ఒప్పందాలను భారత్​ ఉల్లంఘించింది: చైనా

తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ భారత్​పై మరోమారు బురదజల్లే ప్రయత్నం చేసింది చైనా. భారత బలగాలే మొదటగా అక్రమ చొరబాట్లకు పాల్పడి.. యథాతథ స్థితిని మార్చాయని, ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించినట్లు పేర్కొంది.

China
ధ్వైపాక్షిక ఒప్పందాలను భారత్​ ఉల్లంఘించింది: చైనా

By

Published : Sep 3, 2020, 5:15 AM IST

Updated : Sep 3, 2020, 6:53 AM IST

తూర్పు లద్దాఖ్​లోని సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భారత్​పై మరోమారు విమర్శలు చేసింది చైనా. భారత బలగాలే అక్రమంగా వాస్తవాధీన రేఖను దాటి.. ద్వైపాక్షిక ఒప్పందాలు, ఇరుదేశాల మధ్య కుదిరిన కీలక ఏకాభిప్రాయాలను ఉల్లంఘించాయని ఆరోపించారు ఆ దేశా విదేశాంగ ప్రతినిధి హువా చునైంగ్​. ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.

సరిహద్దులో చైనా బలగాల కార్యకలాపాలను తిప్పికొట్టామని భారత్​ పేర్కొంది. భారత దళాలే మొదటగా అక్రమంగా వాస్తవాధీన రేఖను దాటి యథాతథ స్థితిని మార్చాయని ఆ ప్రకటనతోనే తెలుస్తోంది. ద్వైపాక్షిక ఒప్పందాలు, ఏకాభిప్రాయాలను భారత్​ ఉల్లంఘించింది. సరిహద్దులో బలగాలు క్రమశిక్షణగా మెలుగుతూ, రెచ్చగొట్టే చర్యలు మానుకునుకోవాలని భారత్​ను కోరుతున్నాం. ఎల్​ఏసీ వెంబడి అక్రమ చొరబాట్లకు పాల్పడిన వారిని వెనక్కి రప్పించాలి. ఉద్రిక్తతలు పెంచుతూ..సమస్యను మరింత క్లిష్టంగామార్చే చర్యలను మానుకోవాలి.

-హువా చునైంగ్​, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, ముఖ్యమైన ఏకాభిప్రాయాన్ని అమలు చేసేందుకు చైనాతో భారత్​ కలిసి పనిచేస్తుదని ఆశిస్తున్నట్లు చెప్పారు హువా చునైంగ్​. సరిహద్దులో ప్రశాంతతను నెలకొల్పేందుకు చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:''చైనాకు భారత్​ షాక్'​ వార్తలు అవాస్తవం'

Last Updated : Sep 3, 2020, 6:53 AM IST

ABOUT THE AUTHOR

...view details