తెలంగాణ

telangana

ETV Bharat / international

'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్​ సహించదు'

షాంఘై సహకార సంస్థ (ఎస్​సీఓ) సభ్య దేశాల భేటీలో భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ పలు కీలక విషయాలు వెల్లడించారు. సభ్య దేశాల్లో నెలకొన్న వివిధ సమస్యలను ఆయన ప్రస్తావించారు. అఫ్గానిస్థాన్​లో శాంతి స్థాపన జరగాలని, ఇందుకు భారత్​ అన్నివిధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. తీవ్రవాదంపై ఉమ్మడి పోరుకు పిలుపునిచ్చారు.

India unequivocally condemns terrorism
'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్​ సహించదు'

By

Published : Sep 4, 2020, 5:05 PM IST

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్​ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోదని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ స్పష్టంచేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలు తమ పంథా మార్చుకోవాలని హితవు పలికారు. రష్యా రాజధాని మాస్కో వేదికగా జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్​సీఓ) సభ్య దేశాల భేటీలో రాజ్​నాథ్​ సింగ్​ పలు అంశాలపై భారత అభిప్రాయాల్ని పంచుకున్నారు.

ఎస్​సీఓ భేటీలో రాజ్​నాథ్ సింగ్

సాధారణ విపత్తుల నుంచి అసాధారణ సమస్యల వరకు.... అన్నింటినీ ఎదుర్కోవాలంటే మనకు వ్యవస్థీకృత సామర్థ్యం కావాలి. ఉగ్రవాద ప్రచారం, నిర్మూలనను అరికట్టడానికి ఎస్​సీఓ చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ప్రణాళికను స్వాగతిస్తున్నాం. ఉగ్రవాద నిర్మూలనకు ఎస్​సీఓ చేస్తున్న కృషి అభినందనీయం. నమ్మకం, శాంతి, సామరస్యంతోనే ఎస్​సీఓ ప్రాంతాన్ని భద్రంగా ఉంచగలం.

- రాజ్​నాథ్​ సింగ్​, భారత రక్షణ మంత్రి

అఫ్గానిస్థాన్​లో శాంతిస్థాపన జరగాలని రాజ్​నాథ్​ ఆకాంక్షించారు. ఇందుకు భారత్​ అన్నివిధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. గల్ఫ్​ దేశాల్లో ఉద్రిక్తతలపైనా రాజ్​నాథ్ స్పందించారు. విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details