తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​లో భారీగా పెరిగిన పెట్రోల్ ధర- అయినా చక్కెరకన్నా చౌకే!

భారత్​లో పెట్రోల్​, డీజిల్​ ధరలు ఇటీవలి కాలంలో లీటర్​ రూ. వంద దాటింది. పొరుగు దేశం పాక్​లోనూ (Pakistan petrol price) పెట్రోల్​ రేట్లు భగ్గుమంటున్నాయి. అయితే.. అక్కడి చక్కెర ధర (Pakistan sugar rate) తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే. చమురు ధరల కంటే ఇదే ఎక్కువ మరి.

In Pakistan, sugar costs more than petrol
పాక్​లో భారీగా పెరిగిన పెట్రోల్ ధర

By

Published : Nov 5, 2021, 2:12 PM IST

భారత్​లో మాదిరే పొరుగు దేశం పాకిస్థాన్​లోనూ చమురు ధరలు(Pakistan petrol price) ఆకాశాన్నంటుతున్నాయి. అక్కడ లీటర్​ పెట్రోల్​ ధర సుమారు రూ. 138పైనే. శుక్రవారం ఒక్కరోజే లీటరుకు రూ. 8.14 చొప్పున పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

పంచదార కంటే తక్కువే..

అయితే.. ఇదే వారి ప్రధాన సమస్య కాదు. నిత్యావసరాలు కొనుక్కునేందుకు అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో కిలో పంచదార (Pakistan sugar rate) రూ. 150కిపైనే అమ్ముడవుతోంది. నగరాలను బట్టి కాస్త హెచ్చుతగ్గులు ఉన్నాయి.

నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని ఇమ్రాన్​ ఖాన్​ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ.. రేటు అమాంతం పైపైకి పోతూనే ఉంది.

పెషావర్​లోని హోల్​సేల్​ మార్కెట్​లో కిలో చక్కెర (Pakistan sugar rate today).. రూ. 8 మేర పెరిగింది. కిలో చక్కెర హోల్​సేల్​ రేటు రూ. 140 ఉండగా.. రిటైల్​లో రూ. 145-150 మధ్య అమ్ముతున్నారని షుగర్​ డీలర్స్​ అసోసియేషన్​ అధ్యక్షుడు అంటున్నారు.

అయితే.. లాహోర్​లో గురువారం చక్కెర ధర (Sugar rate in Pakistan) రూ.126 ఉండగా, అక్రమంగా లాభాలు పొందేందుకు డీలర్లే కృత్రిమ కొరతను సృష్టించి ఒక్కసారిగా రేట్లు పెంచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇవీ చూడండి: చేజేతులారా ఆహార సంక్షోభంలోకి జారుకున్న చైనా!

Viral video: లిఫ్ట్​లో బెల్ట్​​ ఇరుక్కుని వేలాడిన శునకం

ABOUT THE AUTHOR

...view details