తెలంగాణ

telangana

ETV Bharat / international

గిల్గిత్​-బాల్టిస్థాన్​కు రాష్ట్ర హోదా ప్రకటించిన పాక్​!

గిల్గిత్​ బాల్టిస్థాన్​కు తాత్కాలిక రాష్ట్ర హోదా కల్పిస్తున్నట్లు ప్రకటించింది పాకిస్థాన్​. ఈ ప్రాంతంలో ఆదివారం పర్యటించిన ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​.. ఈ మేరకు ప్రకటన చేసినట్లు జియో న్యూస్​ వెల్లడించింది.

Gilgit-Baltistan
గిల్గిత్​-బాల్టిస్థాన్​కు రాష్ట్ర హోదా

By

Published : Nov 1, 2020, 5:50 PM IST

పాక్​ ఆక్రమిత కశ్మీర్​(పీఓకే)లోని గిల్గిత్​ బాల్టిస్థాన్​ రాజకీయ స్థితిని మార్చాలనే పాకిస్థాన్​ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే.. ఈ నిరసనల మధ్యే ఆ ప్రాంతానికి తాత్కాలిక రాష్ట్ర హోదా కల్పిపిస్తున్నట్లు ప్రకటించింది పాకిస్థాన్​ ప్రభుత్వం.

ఆందోళనల నడుమ.. గిల్గిత్​ బాల్టిస్థాన్​లో ఆదివారం పర్యటించిన ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ఈ మేరకు ప్రకటన చేసినట్లు జియో న్యూస్ వెల్లడించింది.

" గిల్గిత్​ బాల్టిస్థాన్​కు తాత్కాలిక రాష్ట్ర హోదా కల్పించాలని నిర్ణయించిట్లు ప్రకటించటం కూడా ఇక్కడకు రావటానికి గల కారణాల్లో ఒకటి."

- ఇమ్రాన్​ ఖాన్​, పాకిస్థాన్​ ప్రధాని.

పాక్​ ఆక్రమిత కశ్మీర్​, గిల్గిత్​ బాల్టిస్థాన్​ను పాకిస్థాన్​ మ్యాప్​ నుంచి సౌదీ అరేబియా తొలగించిన కొద్ది రోజుల్లోనే ఈ మేరకు ఇమ్రాన్​ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే.. తాజా నిర్ణయం ఆ ప్రాంతంలో ఉద్రిత్త లను పెంచే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: పాకిస్థాన్ బరితెగింపు- గిల్గిత్పై కొత్త కుట్ర

గిల్గిత్​ బాల్టిస్థాన్​లో పాక్​ సర్కారుకు నిరసన సెగ

పాక్‌లో గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ విలీనం! త్వరలో ప్రకటన

ABOUT THE AUTHOR

...view details