తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​లో మరో పురాతన ఆలయంపై దాడి! - పాక్​లో హిందూ ఆలయం మీద దాడులు

పాక్​లోని మరో హిందూ ఆలయంపై దాడి జరిగింది. రావల్పిండి నగరంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఓ దేవాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి.. మెట్లు, ప్రధాన ద్వారం ధ్వంసం చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

Hundred-year-old Hindu temple in Pakistan's Rawalpindi attacked by unidentified people
పాక్​లో 100ఏళ్లు నాటి హిందూ దేవాలయంపై దాడి

By

Published : Mar 29, 2021, 12:42 PM IST

పాకిస్థాన్​లో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. రావల్పిండి పురానా కిలా ప్రాంతంలో ఉన్న వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన పురాతన దేవాలయంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి 7.30 ప్రాంతంలో 10-15 మంది గుడిపై దాడికి పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ దాడిలో ప్రధాన ద్వారం, మెట్లు, పైఅంతస్తు ధ్వంసమయ్యాయని తెలిపారు.

ఈ ఘటనపై నార్తర్న్​ జోన్ ఎవాక్యూ ట్రస్ట్​ ప్రాపర్టీ బోర్డ్​ (ఈటీపీబీ) భద్రతా అధికారి సయ్యద్​ రాజా అబ్బాస్​ జైదీ చేసిన ఫిర్యాదు మేరకు నగరంలోని బిన్ని పోలీసు స్టేషన్​లో ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పురాతన దేవాలయంపై దాడికి పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

గత నెలరోజులుగా ఆ గుడికి మరమ్మత్తులు, ఆధునికీకరణ పనులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:ఆపరేషన్ సూయిజ్: పాక్షికంగా కదిలిన 'ఎవర్ గివెన్'

ABOUT THE AUTHOR

...view details